Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాసర రైల్వేస్టేషన్‌లో గంజాయి పట్టివేత

60 కిలోల గంజాయి స్వాధీనం 

నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు 

బాసర, నవంబరు, 27 : బాసర రైల్వేస్టేషన్‌లో శనివారం 60కిలోల గంజాయి పట్టుబడింది. సంబల్‌పూర్‌ నుంచి నాందేడ్‌కు వెళుతున్న రైల్లో అక్రమంగా రవాణా చేస్తుండగా.. బాసర రైల్వేస్టేషన్‌లో పోలీసులు గుర్తించారు. ఎప్పటిలాగే ప్యాసింజర్‌ లను రైల్వేఅధికారులు తనిఖీ చేస్తున్న క్రమంలో నలుగురు మహిళలపై అను మానం వచ్చింది. సాధారణంగా ఉన్నవారు లగేజీ మాత్రం ఏడెనిమిది పెద్ద బ్యాగు లు కలిగి ఉండడంతో.. అనుమానం వచ్చి పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహిం చారు. దీంతో గంజాయి అక్రమ రవాణా వెలుగు చూసింది. స్థానిక రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీసులు పంచనామా నిర్వహించారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement
Advertisement