Abn logo
Oct 22 2021 @ 19:22PM

నల్గొండ జిల్లాలో గంజాయి స్వాధీనం

నల్గొండ: జిల్లాలోని వేర్వేరు ప్రదేశాలలో 37 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులు తనిఖీలు చేసారు. ఆర్టీసీ డిపో దగ్గర గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసారు. వారి వద్ద నుంచి 21 కేజీల గంజాయిని టూటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


అలాగే  మిర్యాలగూడ మండలంలోని టిక్యతండా దగ్గర గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని రవాణా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేసారు. వారి వద్ద నుంచి 16 కేజీల గంజాయిని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  


ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...