Abn logo
Sep 20 2021 @ 20:18PM

విశాఖ ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టివేత

విశాఖ: జిల్లాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దారకొండ నుంచి ఢీల్లీకి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బస్సులో రవాణా చేయడానికి సీలేరు ఐటిఐ వద్ద స్మగ్లర్లు వేచి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముందస్తు సమాచారంతో సీలేరు పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. గంజాయి రవాణా చేస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టబడిన వారిలో ఇద్దరు యువతులున్నారు. నిందితుల నుంచి 200 కిలోల గంజాయి, 7 సెల్ ఫోన్‌లు, రూ.5వేల 650 రూపాయలు డబ్బు , ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption