Advertisement
Advertisement
Abn logo
Advertisement

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

పర్చూరు, నవంబరు 30: అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఎస్‌ఐ వైవీ రమణయ్య సిబ్బందితో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యద్దనపూడి నుంచి వస్తున్న టాటా వాహనాన్ని నిలిపి తనిఖీ చేశారు. అందులో 70 బస్తాల రేషన్‌ బియ్యాన్ని  గుర్తించారు. వాహనాన్ని పర్చూరు పోలీసు స్టేషన్‌కు తరలించి క్రిమినల్‌ కేసు న మోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ వాసుదేరావు పోలీసు స్టేషన్‌కు చేరుకుని 6ఎ కేసు నమోదు చేసి బియ్యాన్ని రేషన్‌ డీలర్‌కు అప్పగించారు. 

అలాగే, కారంచేడు మండలంలో 150 బస్తాల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. మంగళవారం ఉదయం  ఎస్‌ఐ అహ్మద్‌జానీ సిబ్బం దితో  వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో కారంచేడులోని కాలువ సెంటర్‌లో లారీని ఆపి తనిఖీ చేశారు. అక్రమంగా చీరాల నుంచి త రలిస్తున్న  రేషన్‌ బియ్యాన్ని కారంచేడు పోలీసులు పట్టుకున్నారు.  అందులో 150 బస్తాల రేషన్‌ బియ్యం ఉండటంతో వాహనాన్ని పో లీసు సేష్టన్‌కు తరలించి ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఎన్‌పోర్స్‌మెంట్‌ అధికారి వాసుదేవరావు సంఘటనా స్థలానికి చేరుకు ని బియ్యం బస్తాలను పంచనామ నిర్వహించిన గోడ్‌న్‌కు తర లించారు. 

Advertisement
Advertisement