Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెలంగాణ మద్యం పట్టివేత

కర్నూలు: జిల్లా  గుండా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. అనుమతి లేకుండా మద్యాన్ని తరలిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో నగర శివారులోని సెబ్ తనిఖీ కేంద్రం దగ్గర వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఆటోలో తరలిస్తున్న 218 తెలంగాణ మద్యం బాటిల్స్‌ను పట్టుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement