Oct 26 2021 @ 15:05PM

దాతృత్వం చాటుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల

మంచి కథలతో, చక్కటి సందేశాలతో సినిమాలు తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల .. ఇటీవల ‘లవ్ స్టోరీ’ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. అయితే ఆయన సెన్సిబుల్ డైరెక్టరే కాకుండా.. తాను చాలా సెన్సిటివ్ కూడా అని రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ద్వారా నిరూపించుకున్నారు. సూర్యపేట జిల్లా మునగాల మండలం నేలమర్రిలో ఒక రైతు గుడిశె దగ్ధమై.. బీరువాలో దాచుకొన్న రూ.6 లక్షలు బూడిదయ్యాయి.


ఈ వార్త మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. ఆ రైతు దురదృష్టానికి అందరూ బాధపడ్డారు. అయితే ఈ కథనానికి చెలించిపోయిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఆ రైతుకి ఆర్ధిక సహాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రూ. 1లక్ష రూపాయల్ని నేరుగా ఆయన బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేశారు. అంతేకాకుండా.. భవిష్యత్తులో వారికి ఇంకే కష్టమొచ్చినా అండగా ఉంటానని భరోసానిచ్చారు.