Abn logo
Jan 25 2021 @ 22:15PM

చైతూ, సాయిపల్లవిల ‘లవ్‌ స్టోరీ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

సెన్సిబుల్ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో యువ సామ్రాట్‌ నాగచైతన్య, డ్యాన్సింగ్‌ బ్యూటీ సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'లవ్‌ స్టోరీ'. ఈ చిత్ర రిలీజ్‌ డేట్‌ను చిత్రయూనిట్‌ ఫిక్స్‌ చేసింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రతీది సూపర్బ్‌ రెస్పాన్స్‌ పొందడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. భారీ అంచనాలున్న ఈ ప్రేమకావ్యాన్ని ఏప్రిల్‌ 16న విడుదల చేయబోతోన్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. అంటే హాట్ సమ్మర్‌లో కూల్ లవ్ స్టోరీని ఎంజాయ్ చేయబోతున్నారు ప్రేక్షకులు.


ఈ ప్రకటనకు సంబంధించి ఓ లవ్‌లీ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్‌. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 'ఫిదా' తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి చేస్తున్న చిత్రం కావడంతో పాటు చైతూ, సాయిపల్లవిల కాంబినేషన్‌ ఈ సినిమా కోసం వేచి చూసేలా చేస్తుంది. చిత్రయూనిట్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించడంతో.. సోషల్‌ మీడియా వ్యాప్తంగా 'వెయిటింగ్‌' అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మాతలు.

Advertisement
Advertisement
Advertisement