Abn logo
May 23 2020 @ 15:49PM

‘లవ్‌ స్టోరీ’ నిర్మాతతోనే శేఖర్ కమ్ముల తదుపరి చిత్రం

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తర్వాతి సినిమా కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం నాగ చైతన్య, సాయిపల్లవిలతో ‘లవ్ స్టోరీ’ మూవీ చేస్తున్న శేఖర్ కమ్ముల ఆ మూవీకి సంబంధించిన ఇంకా 15 రోజుల షూటింగ్ మిగిలి ఉండగానే.. తన తర్వాతి సినిమాను కూడా లాక్ చేసేశారు. అది కూడా ‘లవ్ స్టోరీ’ మూవీ నిర్మాతతోనే. ఓ స్టార్ హీరో ఈ మూవీలో నటించనున్నారు. సినిమా సినిమాకు ఎప్పుడూ గ్యాప్ తీసుకునే శేఖర్ కమ్ముల ఈసారి లాక్‌డౌన్ బ్రేక్‌లో తన తర్వాతి సినిమాకు సంబంధించిన వర్క్ కూడా చేసుకుంటున్నారు.


‘లవ్ స్టోరీ’ మూవీ కంటెంట్ మీదున్న నమ్మకం, శేఖర్ పనితనం నచ్చిన ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ తమ తరవాత సినిమా కూడా శేఖర్‌ను చేయమని కోరగానే.. ఆయన వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అధికారికంగా ప్రకటించారు. ఈ కరోనా క్రైసిస్‌లో నిర్మాతకు హెల్ప్ అయ్యేలాగా ఇలాంటి డెసిషన్ తీసుకోవటం శేఖర్ కమ్ముల మంచితనం అని చెప్పుకోవాలి. లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అవ్వగానే ఈ మూవీ పట్టాలెక్కనుంది. శేఖర్ కమ్ముల స్టైల్లో సాగే ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ నారంగ్ నిర్మించనున్నారు. ఈ మూవీ గురించి మిగతా విషయాలు త్వరలో తెలియజేయనున్నారు.

Advertisement
Advertisement
Advertisement