రెండో దఫా ఇళ్ల స్థలాల లబ్ధిదారుల ఎంపిక పూర్తి

ABN , First Publish Date - 2020-05-31T10:04:17+05:30 IST

నవరత్నాల అమలులో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు రెండో దఫా స్వీకరించిన

రెండో దఫా ఇళ్ల స్థలాల లబ్ధిదారుల ఎంపిక పూర్తి

  • అభ్యర్థనలు 99,929.. అర్హులు 56,431
  • జూన్‌ 7న లబ్ధిదారుల తుది జాబితా ప్రకటన
  • జిల్లాలో భారీగా పెరుగుతున్న దరఖాస్తుదారులు

(అమలాపురం - ఆంధ్రజ్యోతి): నవరత్నాల అమలులో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు రెండో దఫా స్వీకరించిన దరఖా స్తుల విచారణ తుది దశకు చేరింది. జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష మంది వరకు లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వారిలో యాభై శాతం మంది లబ్ధిదారు లను అధికారులు అర్హులుగా గుర్తించారు. వీరి దరఖాస్తుల విచారణ ప్రక్రియ వాస్తవానికి శనివారంతో ముగియవలసి ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. జిల్లాలో ఏడు డివిజన్‌ల పరిధిలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు పన్నెండు పట్టణాలు, కార్పొరేషన్లు, నగర పంచాయ తీలతో కలిపి మొత్తం 99,929 మంది లబ్ధిదారులు దరఖా స్తులు చేశారు. ఈనెల 25తో గడువు ముగిసినప్పటికి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు కసరత్తు చేస్తూనే వచ్చారు.


చివరకు మొత్తం 56,431 మంది లబ్ధిదారులను అర్హు లుగా గుర్తించారు. మొత్తం దరఖాస్తుదారుల్లో 28,811 మందిని అనర్హు లుగా పరిగణించగా, మరో 14,700 మందికి సంబంధించి విచారణ నివేదికలు రావలసి ఉంది. కాకినాడ డివిజన్‌ పరిధిలో 10,694 మంది దరఖాస్తు చేసుకోగా 5,418 మంది ఎంపికయ్యారు. అమలాపురం డివి జన్‌లో 17,524 మంది దరఖాస్తు చేయగా 9,852 మందిని అర్హులుగా గుర్తించారు. పెద్దాపురంలో 20,093 మంది దరఖాస్తు చేయగా 11,535 మంది ఎంపికయ్యారు. రాజమహేంద్రవరం సబ్‌ డివిజన్‌లో 25 వేల మంది దరఖాస్తు చేయగా 13,427 మంది అర్హత సాధించారు. రామ చంద్రపురం డివిజన్‌లో 8,276 మంది దరఖాస్తు చేయగా 3,189 మందిని గుర్తించారు. రంపచోడవరంలో 244 మంది దరఖాస్తు చేయగా 29 మంది అర్హత సాధించారు. ఎటపాక డివిజన్‌ నుంచి ఎటువంటి దర ఖాస్తులు అందలేదు. కాకినాడ నగర కార్పొరేషన్‌తోపాటు అమలాపురం, ముమ్మిడివరం, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, మండపేట, రామ చంద్రపురం, పెద్దాపురం, తుని, ఏలేశ్వరం పట్టణాల్లో 18,095 మంది దరఖాస్తు చేయగా వారిలో 12,981 మందిని అర్హులుగా గుర్తించారు. అయితే రాజమహేంద్రవరం నగర కార్పొరేషన్‌ నుంచి ఎటువంటి దరఖాస్తులు అందలేదు. వీటిని నెలాఖరు నాటికి విచారించి అర్హులైన లబ్ధిదారుల జాబితాను జూన్‌ 7వ తేదీ నాటికి ఖరారు చేసి సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రకటించనున్నారు. కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు భూమి గుర్తింపు, లేఅవుట్ల ఎంపిక వంటి ప్రక్రియను లాటరీ ద్వారా కేటాయించి లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తారు. 

Updated Date - 2020-05-31T10:04:17+05:30 IST