రాష్ట్రస్థాయి స్కేటింగ్‌ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక

ABN , First Publish Date - 2021-10-25T05:08:00+05:30 IST

రాష్ట్రస్థాయి స్కే టింగ్‌ పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేశారు. జి ల్లాకేంద్రంలోని డీఎస్‌ఏ స్కేటింగ్‌ వింగ్‌ నందు ఆదివారం ఈ ఎంపికలు నిర్వహించారు.

రాష్ట్రస్థాయి స్కేటింగ్‌ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
ఎంపికైన జిల్లా జట్టు క్రీడాకారులు

సుభాష్‌నగర్‌, అక్టోబరు 24: రాష్ట్రస్థాయి స్కే టింగ్‌ పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేశారు. జి ల్లాకేంద్రంలోని డీఎస్‌ఏ స్కేటింగ్‌ వింగ్‌ నందు ఆదివారం ఈ ఎంపికలు నిర్వహించారు. ఎంపికై న క్రీడాకారులు నవంబరు 11 నుంచి హైదరాబా ద్‌ ఇందిరా పార్కులో నిర్వహించబోయే రాష్ట్రస్థా యి పోటీలకు ప్రాతినిథ్యం వహిస్తారని జిల్లా రోలర్‌స్కేటింగ్‌ సంఘం అధ్యక్ష, సహాయ కార్యదర్శులు సోమానీ, రాజేంద్రప్రసాద్‌లు తెలిపారు. ఈ పోటీలను కోచ్‌ రాంచందర్‌, సీనియర్‌ క్రీడాకారులు రవిచందర్‌, శంకర్‌ పర్యవేక్షణలో నిర్వహించారు. బాలుర విభాగంలో.. హర్షిత్‌, సాయిదీక్షిత్‌, ఆర్యన్‌, సిద్దార్థ్‌రెడ్డి, క్రిష్‌రావు, షేక్‌, భరత్‌, లోకేష్‌, శశికిషన్‌రావు.. బాలికల విభాగంలో.. గజవాడ ప్రఖ్యాతి, హర్షిణి, ఆకాంక్ష, కీర్తన రాష్ట్రస్థాయి స్కేటింగ్‌ పోటీలకు ఎంపికయ్యారు.

Updated Date - 2021-10-25T05:08:00+05:30 IST