Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 30 2021 @ 02:23AM

మహిళా ఎంపీలతో శశిథరూర్‌ సెల్ఫీ వివాదాస్పదం

 పార్లమెంటు పనిచేసేందుకు చాలా ఆకర్షణీయమైన 

 చోటు అని ట్వీట్‌.. నెటిజన్ల మండిపాటు


న్యూఢిల్లీ, నవంబరు 29: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ తాజాగా చేసిన ఓ ట్వీట్‌ వివాదాస్పదంగా మారింది. ఆరుగురు మహిళా ఎంపీలతో తీసిన సెల్ఫీని ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన థరూర్‌, ‘లోక్‌సభ ఆకర్షణీయమైన పని ప్రదేశం కాదని ఎవరన్నారు?’ అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చారు. ఇది నెట్టింట వివాదాస్పదంగా మారింది. మహిళలను కించపరిచేలా ఆయన వ్యాఖ్య ఉందని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో మహిళల్ని వస్తువుల్లా చూడటం ఆపండి అంటూ జాతీయ మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖ శర్మ థరూర్‌పై ట్విటర్‌లో మండిపడ్డారు. దీంతో.. థరూర్‌ తన పోస్టు పట్ల క్షమాపణలు చెప్పారు. కొంతమందిని బాధపెట్టినందుకు తనను క్షమించాలని కోరారు. మహిళా ఎంపీలు ప్రోత్సాహంతోనే హాస్య చతురతతో కూడిన పోస్టును పెట్టినట్లు వివరించారు.

Advertisement
Advertisement