Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమ్మా నన్ను క్షమించు.. నేను చచ్చిపోతున్నా.. సెల్ఫీ సూసైడ్ కలకలం

కృష్ణా జిల్లా: జగ్గయ్యపేట పట్టణంలో సెల్ఫీ సూసైడ్ ఘటన కలకలం రేపుతోంది. మిత్తగూడెంకు చెందిన ఆళ్ల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పని చేస్తున్న బైక్ మెకానిక్ సెంటర్‌లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ‘‘అమ్మా నన్ను క్షమించమ్మ.. ఇక నీతో మాట్లాడలేనమ్మా..ఇదే లాస్ట్ మాటమ్మా.. నేను చచ్చిపోతున్నాను.. మీరు మాత్రం నా గురించి ఆగం కావద్దు.. ఇద్దరు తమ్ముళ్లను మంచిగా చూసుకుని ఆనందంగా ఉండాలమ్మా.. మీరు సంతోషంగా ఉంటే చాలమ్మా.. నా జీవితంలో కష్టం తప్ప ఏనాడూ సుఖపడలేదమ్మా.. మీ అందరినీ వదిలిపెట్టి పోవాలని లేదు.. అన్ని విధాల మోసపోయాను.. నేను చనిపోయిన తర్వాత కృష్ణవేణి వస్తే నా శవాన్ని ముట్టుకోనివ్వద్దు.. నా చేతిపై ఆమె పేరుంది. అది తీసేసి నన్ను దహనం చేయాలని వెంకటేశ్వరరావు సెల్ఫీ వీడియోలో కన్నీటిపర్యంతమయ్యాడు..’’

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement