మా సంపదలో సగం సమాజానికే: ఇద్దరు బిలియనీర్ల సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2021-02-27T01:02:52+05:30 IST

దక్షిణ కొరియాకు చెందిన ఇద్దరు బిలియనీర్లు తమ ఆస్తిలో సగం మొత్తాన్ని సమాజానికి ఇచ్చేస్తామని తాజాగా ప్రకటించారు.

మా సంపదలో సగం సమాజానికే: ఇద్దరు బిలియనీర్ల సంచలన ప్రకటన

సియోల్: దక్షిణ కొరియాకు చెందిన ఇద్దరు బిలియనీర్లు తమ ఆస్తిలో సగం మొత్తాన్ని సమాజానికి ఇచ్చేస్తామని తాజాగా ప్రకటించారు. వారిలో ఒకరు  కిమ్ బియోన్ సూ. దక్షిణకొరియాలోని ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్‌కు అధినేత కిమ్ బియోన్ సూ. సారథ్యంలో ప్రారంభమైన ఈ యాప్ కొద్ది కాలంలోనే వినియోగదారులకు చేరువవడంతో కిమ్ బియోన్ సూ అనతి కాలంలోనే కోటీశ్వరుడైపోయారు. ఆయన ఆస్తుల విలువ 9.6 బిలియన్ డాలర్లని సమాచారం. ఇందులోంచి సగం సంపదను సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు కేటాయిస్తానని కిమ్ బియోన్ తాజాగా ప్రకటించారు. ఇలాంటి ఉదారతను కనబర్చిన మరో బిలియనీర్ కిమ్ బాంగ్ జిన్. అక్కడి పాపులర్ ఫుడ్ డెలివరీ యాప్ వూవా బ్రదర్శ్ అధినేత. ఆయన భార్య పేరు బూమీ సూల్. మైక్రోసాఫ్ట వ్యవస్థాపడుకు బిల్, ఆయన భార్య మిలిందా గేట్స్ ఏర్పాటు చేసిన గివింగ్ ప్లెడ్జ్‌‌లో వారు భాగస్వాములయ్యారు. తమ సంపదలో కొంత భాగాన్ని సామాజానికి కేటాయించాలననుకున్న వారికి ప్రోత్సహించేందుకు బిట్ గేట్స్ దంపతులు గివింగ్ ప్లేడ్జ్ వేదికను రూపొందించారు.  వివిధ దేశాల్లోని ధనవంతలు గివింగ్ ప్లెడ్జ్‌లో భాగస్వాములవడం ద్వారా సమాజ సంక్షేమం కోసం పాటు పడుతున్నారు. కిమ్ దంపతులు కూడా ఈ సమాజశ్రేయస్సు కోసం ఈ మార్గాన్నే ఎంచుకున్నారు.


ఇక దక్షిణకొరియా వ్యాపార సరళి గురించి తెలిస్తే వీరి నిర్ణయం ప్రాధాన్యత ఇట్టే స్పష్టమవుతుంది. రెండో ప్రపంచ అనంతరం.. వ్యాపార పరంగా దక్షిణకొరియా దూసుకపోయింది. అయితే..ఈ వ్యాపారాలన్నీ ఏదో ఒక కుటుంబ చేతిలో ఉన్నవే. తరతరాలుగా ఆ కుటుంబంలోని వారికి వారసత్వంగా సంక్రమిస్తున్నవే. బయటివారి కన్నా కుటుంబసభ్యులతో వ్యాపార లావాదేవీలు సులభమనే ఆలోచనా ధోరణి ఈ తరహా వ్యాపార సామ్రాజ్యాల్ని నెలకొల్పింది. అంతేకాదు.. ఆర్థికపరమైన సహాయసహకారాలు కూడా కుటుంబానికే పరిమితమయ్యేవి. అయితే.. ఈ ఇద్దరు బిలియనీర్లది మాత్రం సామాన్య నేపథ్యం. వారిద్దరూ దిగువమధ్యతరగతి నుంచి వచ్చినవారే. ఈ కారణంగానే వారు తమ సంపదలో సగం వాటాను సమాజానికి తిరిగిచ్చేయాలని నిర్ణయించారు. ‘సామాజంలోని అట్టడుగు వర్గాలకు అత్యధిక లాభం చేకూర్చడంతోనే సంపదకు అసలైన విలువ చేకూరుతుంది’ అని వూవాయాప్ నెలకొల్పిన కిమ్ దంపతులు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-02-27T01:02:52+05:30 IST