Abn logo
Sep 21 2021 @ 00:52AM

అమ్మఒడి వాహనాన్ని వినియోగించుకోవాలి

అవగాహన కల్పిస్తున్న సయ్యద్‌ ఇమ్రాన్‌

సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 20: గర్భిణులు అమ్మఒడి వాహనాన్ని వినియోగిం చుకోవాలని జిల్లా కోఆర్డినేటర్‌ ఎగ్జిక్యూటీవ్‌ సయ్యద్‌ ఇమ్రాన్‌ అన్నారు. సోమవారం సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రి ఆవరణలోని 108, 102 వాహ నాల పని తీరును పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో నెలవారీ వైద్య పరీక్షలకు వచ్చిన గర్భిణులు, ఆశా కార్యకర్తలు, ఆస్పత్రి సిబ్బందికి అవగాహన సద స్సు నిర్వహించారు. గర్భిణులు ప్రతీనెల వైద్య పరీక్షలకు ఆస్పత్రికి రావడానికి, తిరిగి వెళ్లడానికి, ప్రసవానంతరం ఇంటికి వెళ్లడానికి 102 అమ్మఒడి వాహనాన్ని ఉపయో గించుకోవాలన్నారు. అమ్మఒడి వాహన సేవలు ఉచిత మని,  టోల్‌ ఫ్రీ నంబరు 102కు కాల్‌ చేయాలని సూచించారు. ద్విచక్రవాహనాలు, ఆటోల్లో గర్భిణులు ప్రయాణం చేయడం సురక్షితం కాదన్నారు. అమ్మఒడి వాహనంలో శిక్షణ పొందిన డ్రైవర్లు ఉంటారని కొవిడ్‌ నిబంధనలను పాటిస్తారని  అన్నారు. ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండాలని, అమ్మఒడి వాహనం సర్వీస్‌పై అవగాహన కల్పించాలని అన్నారు.  102, 108 సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజ లకు మరిన్ని సేవలు అందించాలని అన్నారు.  అనంతరం 102, 108 వాహనాల రికార్డులను పరిశీ లించారు. సమవేశంలో 108 సిబ్బంది పెద్ది శ్రీనివాస్‌, జలగం సత్యసాగర్‌రావు, 102 సిబ్బంది రాజశేఖర్‌, బాబా అనిల్‌కుమార్‌ సాగర్‌, ఆశా కార్యకర్తలు, మాధవి, జ్యోతి, స్రవంతి పాల్గొన్నారు.