సేమ్యా దోశ

ABN , First Publish Date - 2020-07-04T18:49:10+05:30 IST

సేమ్యా - అరకప్పు, రవ్వ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, బియ్యప్పిండి - అరకప్పు, పెరుగు - పావుకప్పు, ఉప్పు - అర టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - ఒకటి, కరివేపాకు - కొద్దిగా, క్యారెట్‌ తురుము - పావు కప్పు.

సేమ్యా దోశ

కావలసినవి: సేమ్యా - అరకప్పు, రవ్వ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, బియ్యప్పిండి - అరకప్పు, పెరుగు - పావుకప్పు, ఉప్పు - అర టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - ఒకటి, కరివేపాకు - కొద్దిగా, క్యారెట్‌ తురుము - పావు కప్పు.


తయారీ: ముందుగా సేమ్యాను కొద్దిసేపు వేగించాలి. ఒక పాత్రలో వేగించిన సేమ్యా, రవ్వ, బియ్యప్పిండి, పెరుగు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్‌ తురుము, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్‌పై దోశ పాన్‌ పెట్టి వేడి అయ్యాక మిశ్రమాన్ని స్పూన్‌తో దోశెలా పోయాలి. దోశ చక్కగా కాలేందుకు కొద్దిగా నూనె వేయాలి. గోధుమరంగులోకి మారే వరకు కాల్చాలి. దోశ ఒకవైపు బాగా కాలిన తరువాత తిప్పి మరోవైపు కొద్దిగా కాల్చాలి. చట్నీతో వేడి వేడిగా వడ్డించాలి.

Updated Date - 2020-07-04T18:49:10+05:30 IST