Abn logo
Jun 15 2021 @ 02:03AM

‘పరిషత్‌’లకు సీనరేజీ నిధులు

రూ.12.82 కోట్లు విడుదల 

ఒంగోలు (జడ్పీ), జూన్‌ 14 : జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లకు ప్రభుత్వం ఎట్టకేలకు సీనరేజీ నిధులను ఇచ్చింది. మొత్తం రూ.12.82 కోట్లను విడుదల చేసింది.  అందులో జడ్పీకి రూ.4.27 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.8.55 కోట్లు ఉన్నాయి. ఈమేరకు పంచాయతీరాజ్‌ శాఖ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. వీటితోపాటు తలసరి ఖర్చు నిధులు రూ.1.05 కోట్లు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు ఉపయోగించే ఉపయోగించే వాహనాల అద్దె  కోసం రూ.59 కోట్లను కూడా విడుదల చేసింది.