అమెరికా స్టాక్ ఎక్స్చేంజీల్లో చైనా కంపెనీలపై నిషేధం

ABN , First Publish Date - 2020-05-21T23:04:12+05:30 IST

తమ స్టాక్ ఎక్స్చేంజీల్లో చైనా కంపెనీలు షేర్లు లిస్టింగ్ చేయకుండా అమెరికా నిషేధం విధించింది. ఈ మేరకు..

అమెరికా స్టాక్ ఎక్స్చేంజీల్లో  చైనా కంపెనీలపై నిషేధం

వాషింగ్టన్: తమ స్టాక్ ఎక్స్చేంజీల్లో చైనా కంపెనీలు షేర్లు లిస్టింగ్ చేయకుండా అమెరికా నిషేధం విధించింది. ఈ మేరకు ఇవాళ అమెరికా సెనేట్‌లో ఓ చట్టాన్ని ఆమోదించారు. దీని ప్రకారం అమెరికా ఇన్వెస్టర్ల నుంచి చైనా కంపెనీలు నిధులు సేకరించడం కూడా నిషేధం. లూసియానా రిపబ్లిక్ సెనేటర్ జాన్ కెనడీ ప్రతిపాదించిన ఈ బిల్లు కింద.. కంపెనీలు తాము విదేశీ ప్రభుత్వాల నియంత్రణలో పనిచేయడం లేదని ధ్రువీకరణ సమర్పించాల్సి ఉంటుంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో చైనాకి చెందిన ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా షేరు అమాతం 2 శాతానికి పైగా నష్టపోయింది. అన్ని విదేశీ కంపెనీలకూ ఈ చట్టం వర్తిస్తుందని చెప్పినప్పటికీ.. ఇది ప్రత్యేకించి చైనా పని పట్టేందుకే తీసుకొచ్చినట్టు చట్టసభల సభ్యులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. కరోనా వైరస్‌పై చైనా వ్యహరిస్తున్న తీరుపై అమెరికా సెనేటర్లు ఎంత ఆగ్రహంగా ఉన్నారనేందుకు తాజా బిల్లే నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. 





Updated Date - 2020-05-21T23:04:12+05:30 IST