Abn logo
Jul 8 2020 @ 00:45AM

స్మారక సంచికలకు రచనలు పంపండి

ఉమ్మడి మహబూబునగర్‌ జిల్లా ప్రజలకు ఆప్తులు, ప్రజల బాగోగులకోసం సమతాభావనతో, ప్రజాస్వామిక ఆచరణతో జీవించిన మహమ్మద్‌ జమాల్‌ బీహారీ, గూళెం అంపయ్యలు ఇటీవల మరణించారు. వీరిద్దరూ సామాన్యుల బాగుకోసం తమ జీవితకాలమంతా కృషిచేసినవారు. పాలమూరు అధ్యయనవేదిక వీరిపై రెండు స్మారక సంచికలు తెస్తున్నది. ఈ ఇరువురితో అనుబంధం కలిగినవారందరూ తమ అనుభవాలు, జ్ఞాపకాలు రాసి, తమ దగ్గరున్న ఫోటోలతోపాటు జూలై 30వతేదీలోగా–ఎం. రాఘవాచారి, ౩–148, శాంతిచంద్రిక, బాలాజీనగర్‌ కాలనీ, మహబూబునగర్‌, ౫009౦01–చిరునామాకు పంపాలని కోరుతున్నాము.

– పాలమూరు అధ్యయన వేదిక

Advertisement
Advertisement