కొరాడ్‌ కేసుల వివరాలను పంపండి

ABN , First Publish Date - 2020-08-05T10:21:04+05:30 IST

జిల్లాలో అన్ని ప్రైవేటు సిటీ స్కాన్‌ సెంటర్ల వారు కొరాడ్‌-4, కొరాడ్‌-5 (కరోనా)గా గుర్తించిన కేసుల వివరాలను..

కొరాడ్‌ కేసుల వివరాలను పంపండి

గుంటూరు(మెడికల్‌), ఆగస్టు 4: జిల్లాలో అన్ని ప్రైవేటు సిటీ స్కాన్‌ సెంటర్ల వారు కొరాడ్‌-4, కొరాడ్‌-5 (కరోనా)గా గుర్తించిన కేసుల వివరాలను ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.  అన్ని లైన్‌ హాస్పిటల్స్‌ వారికి ఉన్న పడకల సామర్థ్యాన్ని బట్టి కొవిడ్‌ కేసులను అడ్మిట్‌ చేసుకోవాలని ఆదేశించారు. ఆర్‌ఎంపీలు తమ క్లినిక్‌లకు వచ్చే జ్వరం కేసు వివరాలను, ఆక్సిజన్‌ స్థాయి 94 కన్నా తక్కువగా ఉన్న కేసుల వివరాలను సమీపంలోని ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారికి తెలియజేయాలని తెలిపారు. ఆయా కేసుల వివరాలను తెలియజేయకుండా దాచిపెట్టే ఆర్‌ఎంపీలపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. 


Updated Date - 2020-08-05T10:21:04+05:30 IST