‘ఫైవ్‌స్టార్’, ‘ఆటోగ్రాఫ్’, ‘వరలారు’ వంటి చిత్రాల ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులకు.. 'ఒట్టేసి చెబుతున్నా', 'నా ఆటోగ్రాఫ్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన మలయాళ హీరోయిన్ కనిక(కనిహ). ఈ భామ సినీరంగం వీడి పుష్కరకాలమైంది. ఈ కాలంలో పదేళ్ళ పిల్లోడికి తల్లి కూడా అయింది. అయినప్పటికీ ఈమె ఇప్పటికీ స్లిమ్‌గానే కనిపిస్తోంది. దీనికి కారణం ఆమె ఫిట్నెస్. వివాహం చేసుకుని గృహిణిగా మారినా, ఆ తర్వాత ఓ బిడ్డకు తల్లి అయినా తన అందాన్ని మాత్రం కాపాడుకుంటూ వస్తోంది. పైగా, అప్పుడప్పుడూ టూపీస్ దుస్తులతో ప్రత్యేక ఫొటో షూట్ నిర్వహించి, వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
వీటికి ఘాటుగా సమాధానం చెప్పేలా తాజాగా నిక్కర్, బనియన్‌తో ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానిని చూసిన ఓ నెటిజన్.. ఈ వయసులో ఇంత అవసరమా? అంటూ ప్రశ్నించాడు. దానికి ఆమె రిప్లయ్ ఇస్తూ, ‘‘ఔను.. నేను తల్లినే అయితే ఏంటి? నేను షార్ట్ ధరిస్తాను. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు ఇష్టపడతాను. నా జీవితాన్ని అనుభవించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తాను. అదే సమయంలో నా బిడ్డ, నా కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తాను. తల్లిగా ఇలా ఉండాలన్న నిబంధన ఏదైనా ఉందా? పైగా అమ్మతనానికి ప్రత్యేకంగా ఏదైనా బుక్ రచించారా?’’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.