Abn logo
Sep 27 2021 @ 13:57PM

కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన కేరళ సీనియర్ నేత

తిరువనంతపురం : కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) హై పవర్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ)కి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీఎం సుధీరన్ సోమవారం ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి కూడా రాజీనామా సమర్పించారు. ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కేరళ ఇన్‌ఛార్జి తారిక్ అన్వర్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. 


కేపీసీసీ మాజీ అధ్యక్షుడు ముళ్ళపల్లి రామచంద్రన్‌ను శాంతింపజేసేందుకు కూడా అన్వర్ ప్రయత్నిస్తున్నారు. ముళ్ళపల్లి తర్వాత కేపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కే సుధాకరన్‌పై సుధీరన్ మండిపడుతున్నారు. తారిక్ అన్వర్ ఆదివారం సాయంత్రం తనతో సమావేశాన్ని రద్దు చేసిన తీరుపై సుధీరన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం పట్ల సుధీరన్ అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో సమస్యలను పరిష్కరించడంలో అధిష్ఠానం లోపాల గురించి తన సన్నిహితుల వద్ద చెప్తున్నట్లు తెలిసింది. సుధాకరన్ పార్టీకి గొయ్యి తవ్వారని ఆరోపిస్తూ పార్టీ అధిష్ఠానానికి లేఖ రాశారు. సుధాకరన్, ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ గ్రూపులు కట్టే నేతల చేతుల్లో పడ్డారని సుధీరన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.


ఇవి కూడా చదవండిImage Caption