సీబీఐకి చిక్కిన సీనియర్‌ రైల్వే అధికారి

ABN , First Publish Date - 2021-01-18T07:31:57+05:30 IST

కోటి రూపాయలు లంచం తీసుకుంటూ ఇండియన్‌ రైల్వేస్‌ ఇంజనీరింగ్‌ సర్వీస్‌ (ఐఆర్‌ఈఎ్‌స)కు చెందిన సీనియర్‌ అధికారి

సీబీఐకి చిక్కిన సీనియర్‌ రైల్వే అధికారి

కాంట్రాక్టుల కోసం రూ.కోటి లంచం 


న్యూఢిల్లీ,  జనవరి 17 : కోటి రూపాయలు లంచం తీసుకుంటూ ఇండియన్‌ రైల్వేస్‌ ఇంజనీరింగ్‌ సర్వీస్‌ (ఐఆర్‌ఈఎ్‌స)కు చెందిన సీనియర్‌ అధికారి మహీందర్‌ సింగ్‌ చౌహాన్‌ సీబీఐకి ఆదివారం చిక్కారు. నార్త్‌ఈస్ట్‌ ఫ్రంటియర్‌ రైల్వే (ఎన్నారెఫ్‌) పరిధిలో రైల్వే ప్రాజెక్టుల కాంట్రాక్టులు మంజూరుచేసేందుకు లంచంతీసుకున్న ఆరోపణలపై 1985  ఐఆర్‌ఈఎస్‌ బ్యాచ్‌కు చెందిన చౌహాన్‌ను కస్టడీలోకి తీసుకున్నట్టు సీబీఐ ప్రకటించింది. చౌహాన్‌ ప్రస్తుతం ఎన్నారెఫ్‌ కేంద్ర కార్యాలయం మలిగావ్‌(అసోం)లో పనిచేస్తున్నారు.  ఈకేసుతో సంబంధమున్న ఆరోపణలపై ఢిల్లీ, అసోం, ఉత్తరాఖండ్‌, మరో రెండు రాష్ట్రాల పరిధిలోని 20  చోట్ల  సోదాలు నిర్వహిస్తున్నట్టు సీబీఐ  అధికారులు తెలిపారు.

Updated Date - 2021-01-18T07:31:57+05:30 IST