మళ్లీ 51000 పైకి సెన్సెక్స్‌

ABN , First Publish Date - 2021-02-26T09:56:24+05:30 IST

మళ్లీ 51000 పైకి సెన్సెక్స్‌

మళ్లీ 51000 పైకి సెన్సెక్స్‌

ముంబై : ఒకపక్క డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపు, మరోపక్క అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో వరుసగా మూడో రోజున కూడా స్టాక్‌ మార్కెట్‌ పరుగులు తీసింది. సెన్సెక్స్‌ 51000, నిఫ్టీ 15000 పైన తిరిగి స్థిరపడ్డాయి. సెన్సెక్స్‌ 257.62 పాయింట్లు లాభపడి 51039.31 వద్ద నిఫ్టీ 115.35 పాయింట్ల లాభంతో 15097.35 వద్ద క్లోజైం ది. కాగా ఎఫ్‌పీఐలు బుధవారం నాడు స్టాక్‌ మార్కెట్లో నికరంగా రూ.28,739.17 కోట్ల నిధులు ఇన్వెస్ట్‌ చేశారు.


అనుసంధానత లోపం ప్రపంచవ్యాప్తం

ఈక్విటీ మార్కెట్లకు, వాస్తవ ఆర్థిక స్థితికి మధ్యన అనుసంధానం లోపించడమనేది అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామమేనని సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి అన్నారు. వాస్తవానికి ఈక్విటీ మార్కెట్లు ఆర్థిక వ్యవస్థ స్వస్థతకు దర్పణం పడతాయని, కాని కరోనా అనంతర కాలంలో ఆ అనుసంధానత లోపించిందని ఇటీవల ఆర్‌బీఐ సహా పలు సంస్థలు ఆందోళన ప్రకటించాయి. కొవిడ్‌ అనంతర కాలంలో మార్కెట్‌ ఆటుపోట్ల సూచీ ఐదేళ్ల సగటు కన్నా ఎగువన  ఉన్నట్టు త్యాగి చెప్పారు.

Updated Date - 2021-02-26T09:56:24+05:30 IST