సెన్సెక్స్‌ @ 45,000

ABN , First Publish Date - 2020-12-05T06:53:57+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ తొలిసారిగా 45,000 మైలురాయిని దాటింది. శుక్రవారం 446.90 పాయింట్ల లాభంతో 45,079.55 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 124.65 పాయింట్లు పెరి గి 13,258.55 వద్దకు చేరుకుంది...

సెన్సెక్స్‌ @ 45,000

  • స్టాక్‌ మార్కెట్లకు ఆర్‌బీఐ పాలసీ కిక్కు
  • సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి సూచీలు 

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ తొలిసారిగా 45,000 మైలురాయిని దాటింది. శుక్రవారం   446.90 పాయింట్ల లాభంతో 45,079.55 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 124.65 పాయింట్లు పెరిగి 13,258.55 వద్దకు చేరుకుంది. సూచీలకిది ఆల్‌టైం రికార్డు ముగింపు స్థాయి. అంతేకాదు, సెన్సెక్స్‌ 45,148.28 వద్ద, నిఫ్టీ 13,280.05 వద్ద సరికొత్త జీవితకాల గరిష్ఠ ఇంట్రాడే స్థాయిలను నమోదు చేసుకున్నాయి. ఆర్‌బీఐ పరపతి సమీక్ష నిర్ణయాలపై మార్కెట్‌ వర్గాలు సానుకూలంగా స్పందించాయి. ఈ సారి రెపో రేట్లను యథాతథంగా కొనసాగించినప్పటికీ వృద్ధి కి ఊతమిచ్చేందుకు భవిష్యత్‌లో మరింత తగ్గిస్తామన్న సంకేతాలు, సానుకూల వృద్ధి అంచనాలు మార్కెట్లో జోష్‌ పెంచాయి. వడ్డీ రేట్ల ప్రభావిత రంగాలైన బ్యాం కింగ్‌, ఫైనాన్షియల్‌, రియల్టీ, ఆటో  షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు సరికొత్త ఉన్నత శిఖరాలను అధిరోహించాయి.  


రూ.1.3 లక్షల కోట్లు పెరిగిన సంపద: శుక్రవారం బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ మరో రూ.1.3 లక్షల కోట్ల మేర పెరిగి రూ.179.5 లక్షల కోట్లకు చేరుకుంది. 


బర్గర్‌ కింగ్‌ ఐపీఓ బంపర్‌ హిట్‌: శుక్రవారంతో ముగిసిన బర్గర్‌ కింగ్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు అపూర్వ స్పందన లభించింది. కంపెనీ ఇష్యూ సైజుతో పోలిస్తే 156.65 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. అర్హులైన సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబీ) విభాగం నుంచి 86.64 రెట్ల సబ్‌స్ర్కిప్షన్‌ లభించగా.. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 354.11 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి 68.14 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఐపీఓ ద్వారా రూ.810 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 


6 నెలల్లో 50000కు సెన్సెక్స్‌: ఇప్పటికే ఆల్‌టైం గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్న సూచీలు మరింత ర్యాలీ తీయాలంటే కొంత కన్సాలిడేషన్‌ కావాల్సిన అసవరం ఉందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. దిద్దుబాటు తర్వాత సెన్సెక్స్‌ మళ్లీ కుదురుకొని 47,000 స్థాయికి.. ఆరు నెలల్లో 50000 మైలురాయికి ఎగబాకే అవకాశాలు ఉన్నాయని వారు అంచనా వేస్తున్నారు. 


Updated Date - 2020-12-05T06:53:57+05:30 IST