సెన్సెక్స్‌ ‌ దూకుడు.. 748 పాయింట్ల లాభం

ABN , First Publish Date - 2020-08-05T06:32:02+05:30 IST

స్టాక్‌ మార్కెట్లో నాలుగు రోజుల వరుస నష్టాలకు మంగళవారం తెరపడింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు షేర్ల అండతో సూచీలు పరుగులు తీశాయి

సెన్సెక్స్‌ ‌ దూకుడు.. 748 పాయింట్ల లాభం

ముంబై: స్టాక్‌ మార్కెట్లో నాలుగు రోజుల వరుస నష్టాలకు మంగళవారం తెరపడింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు షేర్ల అండతో సూచీలు పరుగులు తీశాయి. సెన్సెక్స్‌ 748.31 పాయింట్ల లాభంతో 37,687.91 దగ్గర క్లోజవగా, నిఫ్టీ 203.65 పాయింట్ల లాభంతో 11,095.25 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ ప్యాక్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు అత్యధికంగా 7.10 శాతం లాభంతో రూ.2151.15 వద్ద క్లోజైంది. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు, ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు లాబాల్లో ట్రేడవడం ఇందుకు దోహదం చేసింది. హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్‌ సర్కార్‌ కొత్త ఆంక్షలతో ఐటీ, టెక్నాలజీ కంపెనీల షేర్లు మాత్రం నీరసించాయి.  

Updated Date - 2020-08-05T06:32:02+05:30 IST