వరుసగా రెండోరోజు లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

ABN , First Publish Date - 2020-07-02T23:49:42+05:30 IST

దేశీయ మార్కెట్లు ఇవాళ వరుసగా రెండోరెండో భారీ లాభాలతో ముగిశాయి. ఆటో, ఐటీ షేర్లు లాభాల బాట...

వరుసగా రెండోరోజు లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

ముంబై: దేశీయ మార్కెట్లు ఇవాళ వరుసగా రెండోరెండో భారీ లాభాలతో ముగిశాయి. ఆటో, ఐటీ షేర్లు లాభాల బాట పట్టడంతో బీఎస్ఈ సెన్సెక్స్ ఇవాళ 400 పాయింట్లకు పైగా ఎగబాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 429 పాయింట్లు (1.21 శాతం) లాభపడి 35,844 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 122 పాయింట్లు (1.17 శాతం) ఎగసి 10,552 వద్ద ముగిసింది. ఎంఅండ్ఎం, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర షేర్లు అత్యధికంగా 6.21 శాతానికి పైబడి లాభం నమోదు చేశాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్, కొటాక్ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంకు తదితర షేర్లు 1.92 శాతం వరకు నష్టపోయాయి.  

Updated Date - 2020-07-02T23:49:42+05:30 IST