Advertisement
Advertisement
Abn logo
Advertisement

సెన్సెక్స్‌ హైజంప్‌

ముంబై: ఒమైక్రాన్‌ భయాలతో వరుసగా రెండ్రోజులు కుంగిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. మంగళవారం భారీగా పుంజుకున్నాయి. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ప్రభావ తీవ్రత తక్కువేనన్న నిపుణుల అభిప్రాయాలు ఇందుకు దోహదపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ట్రేడింగ్‌ సంకేతాలకు అనుగుణంగా దలాల్‌ స్ట్రీట్‌లోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లను కదం తొక్కించారు. దాంతో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 886.51 పాయిం ట్లు (1.56 శాతం) ఎగబాకి 57,633.65 వద్దకు చేరుకుంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ కూడా 264.45 పాయింట్లు (1.56 శాతం) పెరిగి 17,176.70 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో ఏషియన్‌ పెయింట్స్‌ మినహా అన్నీ లాభపడ్డాయి. టాటా స్టీల్‌ 3.63 శాతం పెరిగి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. కొనుగోళ్ల జోరులో స్టాక్‌ మార్కెట్‌ సంపద రూ.3.45 లక్షల కోట్లు పెరిగి రూ.260.18 లక్షల కోట్లకు చేరుకుంది. 

Advertisement
Advertisement