భారీ నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

ABN , First Publish Date - 2020-11-25T23:13:01+05:30 IST

మంగళవారం రికార్డు స్థాయి లాభాలు నమోదు చేసిన భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ...

భారీ నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

ముంబై: మంగళవారం రికార్డు స్థాయి లాభాలు నమోదు చేసిన భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ అమాంతం కుప్పకూలాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పోటీ పడడంతో దేశీయ సూచీలు దాదాపు 1.5 శాతం మేర పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ ఫలితాల కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, కొటాక్ బ్యాంకు తదితర షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 694.92 పాయింట్లు (1.56 శాతం) నష్టపోయి 43,828.10 వద్ద స్థిరపడింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 196.75 పాయింట్లు (1.51 శాతం) నష్టపోయి 12,858.40 వద్ద ముగిసింది. 


Updated Date - 2020-11-25T23:13:01+05:30 IST