4 నెలల గరిష్ఠానికి

ABN , First Publish Date - 2020-07-07T07:00:03+05:30 IST

స్టాక్‌ మార్కెట్లో ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్‌, నిఫ్టీ నాలుగు నెలల గరిష్ఠ స్థాయిలో ముగిశాయి. కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్‌ 465.86 పాయింట్ల లాభంతో 36,487.28 దగ్గర క్లోజవగా 156.30 పాయింట్ల లాభంతో...

4 నెలల గరిష్ఠానికి

  • 466 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌ 


ముంబై: స్టాక్‌ మార్కెట్లో ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్‌, నిఫ్టీ నాలుగు నెలల గరిష్ఠ స్థాయిలో ముగిశాయి. కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్‌ 465.86 పాయింట్ల లాభంతో 36,487.28 దగ్గర క్లోజవగా 156.30 పాయింట్ల లాభంతో నిఫ్టీ 10,763.65 వద్ద ముగిసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ షేర్లలో ర్యాలీ సోమవారం సూచీలను పరుగెత్తించాయి.   


రిలయన్స్‌ @ రూ.12.14 లక్షల కోట్లు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) షేరు తన జోరును కొనసాగించింది. బీఎ్‌సఈలో ఆర్‌ఐఎల్‌ షేరు ఒక దశలో 3.94 శాతం లాభంతో రూ.1,858 ఆల్‌టైమ్‌ హైకి చేరింది. చివరకు 3.57 శాతం లాభంతో రూ.1,851.40 వద్ద క్లోజైంది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.11.73 లక్షల కోట్లకు చేరింది. కంపెనీ ఇటీవల రైట్స్‌ ఇష్యూ కింద జారీ చేసిన పాక్షిక చెల్లిం పు షేర్ల మార్కెట్‌ విలువ సోమవారం రూ.40,000 కోట్లు మించిపోయింది. దీంతో ఆర్‌ఐఎల్‌ మొత్తం మార్కెట్‌ క్యాప్‌ రూ.12.14 లక్షల కోట్లుగా నమోదైంది. ఒక భారత కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి.  


పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.1,507 కోట్ల ఆర్డర్లు 

పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్‌.. రూ.1,507 కోట్ల విలువైన ప్రాజెక్టుల ను అందుకుంది. కాంట్రాక్టులో భాగంగా తెలంగాణలోని నల్లగొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ లో ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యం గల 5 యూనిట్లకు సంబంధించి సివిల్‌, ఆర్కిటెక్చరల్‌ పనులను చేపట్టాల్సి ఉంటుంది. అలాగే మధ్యప్రదేశ్‌ రాష్ట్ర మైనింగ్‌ కార్పొరేషన్‌, ఎన్‌ఎండీసి సంస్థల నుంచి ఆర్డర్లను దక్కించుకుంది.

Updated Date - 2020-07-07T07:00:03+05:30 IST