భారీ నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

ABN , First Publish Date - 2021-01-15T22:41:38+05:30 IST

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పోటీపడడంతో బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు ...

భారీ నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

న్యూఢిల్లీ: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పోటీపడడంతో బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 550 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ సైతం 160 పాయింట్లు పతనమైంది. ఇటీవల మార్కెట్లు బలపడడంతో ట్రేడర్లు ఇవాళ లాభాల స్వీకరణకు పూనుకున్నారనీ.. దీని కారణంగానే దేశీయ సూచీలు నేలచూపులు చూశాయని మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు. ప్రత్యేకించి బ్యాంకింగ్, ఐటీ, ఆటో స్టాక్‌లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 549 పాయింట్లు (1.11 శాతం) నష్టపోయి 49,035 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 162 పాయింట్లు (1.11 శాతం) పతనమై 14,434 వద్ద క్లోజ్ అయ్యింది. సెన్సెక్స్‌లో టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఓఎన్‌జీసీ, ఏసియన్ పెయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్ తదితర షేర్లు అత్యధికంగా దాదాపు 4 శాతం మేర నష్టపోయాయి. నిఫ్టీలో ఐటీ, పీఎస్‌యూ బ్యాంకు షేర్లు 2.24 శాతం మేర నష్టాలను ఎదుర్కొన్నాయి. 

Updated Date - 2021-01-15T22:41:38+05:30 IST