Abn logo
Nov 26 2020 @ 16:42PM

దేశీయ మార్కెట్లు మళ్లీ జూమ్.. మెటల్, బ్యాంకింగ్ షేర్ల అండతో..

ముంబై: నిన్న భారీ నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు ఇవాళ మళ్లీ కోలుకున్నాయి. మెటల్, బ్యాంకింగ్ షేర్ల అండతో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా బలపడగా... నిఫ్టీ మరోసారి 13 వేల మార్కునకు సమీపంలో నిలిచింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 431.64 పాయింట్ల (0.98 శాతం) లాభంతో 44,259.74 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 128.60 పాయింట్లు (1.00 శాంత) బలపడి 12,987 వద్ద క్లోజ్ అయ్యింది. సెన్సెక్స్‌లో టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్ టెక్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తదితర షేర్లు 5.30 శాతం మేర లాభాలను ఆర్జించాయి. ఓఎన్జీసీ, మారుతీ, టెక్ మహీంద్రా, ఇండస్‌ ఇండ్ బ్యాంకు తదితర షేర్లు 0.68 శాతం మేర క్షీణించాయి. 

Advertisement
Advertisement
Advertisement