8000 పైన నిలకడ తప్పనిసరి.. టెక్‌ వ్యూ

ABN , First Publish Date - 2020-04-06T06:17:36+05:30 IST

నిఫ్టీ గత వారం కీలక స్థాయి 9000 వద్ద విఫలమై అంతకు ముందు వారంలో ఏర్పడిన ర్యాలీని కొనసాగించలేకపోయింది. చివరికి వీక్లీ చార్టుల్లో వారం కనిష్ఠ స్థాయి ల్లో క్లోజ్‌ కావడం కూడా అమ్మకాల...

8000 పైన నిలకడ తప్పనిసరి..  టెక్‌ వ్యూ

నిఫ్టీ గత వారం కీలక స్థాయి 9000 వద్ద విఫలమై అంతకు ముందు వారంలో ఏర్పడిన ర్యాలీని కొనసాగించలేకపోయింది. చివరికి వీక్లీ చార్టుల్లో వారం కనిష్ఠ స్థాయి ల్లో క్లోజ్‌ కావడం కూడా అమ్మకాల ఒత్తిడిని సూచిస్తోంది. అలాగే స్వల్పకాలిక డిఎంఏల వద్ద కూడా విఫలం కావడం ప్రధాన ట్రెండ్‌ ఇప్పటికీ దిగువకే ఉన్నదనేందుకు నిదర్శనం. కనిష్ఠ స్థాయిల్లో కన్సాలిడేషన్‌ కూడా సాధించలేకపోవడంతో పాటు ఇంకా కనిష్ఠ స్థాయిని చేరినట్టు కనిపించడంలేదు. మద్దతు స్థాయిలన్నింటినీ పోగొట్టుకోవడం బేరిష్‌ మార్కెట్లలో గాని, అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు గాని జరుగుతూ ఉంటుంది.  

బుల్లిష్‌ స్థాయిలు: సానుకూలత కోసం 8000 వద్ద కన్సాలిడేట్‌ కావాలి. తదుపరి నిరోధం 8300. మరింత అప్‌ట్రెండ్‌లో ప్రవేశించాలంటే ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. ఒకవేళ మరింత కరెక్షన్‌లో పడినా కీలక మద్దతు స్థాయి, ప్రధాన బాటమ్‌ 7500 వద్ద బౌన్స్‌బ్యాక్‌ సాధించడం తప్పనిసరి. 

బేరిష్‌ స్థాయిలు: 8000 వద్ద విఫలమైతే డౌన్‌ట్రెండ్‌ ముప్పు ఏ ర్పడుతుంది. దిగువన మద్దతు స్థా యి 7700. అంతకన్నా దిగజారితే ప్రధాన మద్దతు స్థాయి 7500 వద్ద కన్సాలిడేషన్‌కు ఆస్కారం ఉంది. 

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీకి ప్రధాన మద్దతు స్థాయి 16600. అంతకన్నా దిగజారితే మరో ప్రధాన మద్దతు స్థాయి 16000.

పాటర్న్‌: మార్కెట్‌ ‘‘ఏటవాలుగా దిగువకు కనిపిస్తున్న రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగువన ఉండడం ఇంకా డౌన్‌ట్రెండ్‌లోనే ఉన్నదనేందుకు నిదర్శనం. 8000 వద్ద ‘‘అడ్డంగా కనిపిస్తున్న సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగజారితే మరింత డౌన్‌ట్రెండ్‌ ఉంటుంది. 7500 వద్ద ‘‘అడ్డంగా కనిపిస్తున్న సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద రికవరీకి ఆస్కారం ఉంది. టైమ్‌ : ఈ సూచి ప్రకారం గురువారం మైనర్‌ రివర్సల్‌ ఉంది. 

Updated Date - 2020-04-06T06:17:36+05:30 IST