సెన్సెక్స్‌ @ 61,000

ABN , First Publish Date - 2021-10-15T06:36:38+05:30 IST

వరుసగా ఆరో రోజు లాభాల్లో పయనించిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి.

సెన్సెక్స్‌ @ 61,000

మరో 569 పాయింట్లు పెరిగిన సూచీ 

వరుసగా ఆరో రోజూ లాభాల్లో పయనం 

రూ.272.76 లక్షల కోట్లకు మార్కెట్‌ సంపద 


ముంబై: వరుసగా ఆరో రోజు లాభాల్లో పయనించిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. దేశీయ స్థూల ఆర్థికాంశాలు మరింత మెరుగవడంతో పాటు సానుకూల అంతర్జాతీయ మార్కెట్‌ సంకేతాలు గురువారం మార్కెట్‌ను మరింత ముందుకు నడిపించాయి. దాంతో   బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 61,000 మైలురాయిని దాటింది. గురువారం ట్రేడింగ్‌ ముగిసేసరికి సూచీ 568.90 పాయింట్లు బలపడి 61,305.25 వద్దకు చేరుకుంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 176.80 పాయింట్ల లాభంతో 18,338.55 వద్ద క్లోజైంది. సూచీలకు సరికొత్త గరిష్ఠ ముగింపు స్థాయిలివి. అంతేకాదు, సెన్సెక్స్‌ 61,353.25 వద్ద.. నిఫ్టీ 18,350.25 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డులను సైతం నమోదు చేసుకున్నాయి. సెన్సెక్స్‌ కంపెనీల్లో ఐటీసీ షేరు 2.89 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఎల్‌ అండ్‌ టీ సైతం 2 శాతానికి పైగా పుంజుకున్నాయి. టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు మాత్రం ఒక శాతానికి పైగా క్షీణించాయి. బీఎ్‌సఈలో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, మెటల్‌, రియల్టీ, క్యాపిటల్‌ గూడ్స్‌, బేసిక్‌ మెటీరియల్స్‌ సూచీలు 1.67 శాతం వరకు పెరగగా.. ఆటో ఇండెక్స్‌ మాత్రం 0.71 శాతం నష్టపోయింది. బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు అర శాతం మేర బలపడ్డాయి. ఈ వారం మొత్తానికి సెన్సెక్స్‌ 1,246.89 పాయింట్లు (2.07 శాతం), నిఫ్టీ 443.35 పాయింట్లు (2.47 శాతం) పుంజుకున్నాయి. దాంతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ సంపద సరికొత్త ఆల్‌టైం గరిష్ఠ స్థాయి రూ.272.76 లక్షల కోట్లకు చేరుకుంది. ఒక్కరోజులోనే రూ.2 లక్షల కోట్లకు పైగా పెరిగింది. గడిచిన 6  సెషన్లలో రూ.10.56 లక్షల కోట్లు పెరిగింది. ఫారెక్స్‌ మార్కెట్‌ విషయానికొస్తే, డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసల మేర బలపడి రూ.75.26గా నమోదైంది.


కేవలం 14 ట్రేడింగ్‌ సెషన్లలో ... 

గత నెల 24న సెన్సెక్స్‌ తొలిసారిగా 60 వేల మైలురాయికి చేరింది. తర్వాత కేవలం 14 ట్రేడింగ్‌ సెషన్లలోనే 1,000 పాయింట్లు పుంజుకుని 61,000 శిఖరాన్ని చేరుకుంది. 



Updated Date - 2021-10-15T06:36:38+05:30 IST