గుండె సమస్యలను ముందే గుర్తించే సెన్సర్‌

ABN , First Publish Date - 2020-02-27T08:17:55+05:30 IST

గుండె సమస్యలను ముందుగానే గుర్తించి హెచ్చరించే సెన్సర్‌ తొడుగులను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇవి కృత్రిమ మేధ సహాయంతో పనిచేస్తాయి. హృద్రోగులు వీటిని తమ ఛాతిపైన ధరిస్తే...

గుండె సమస్యలను ముందే గుర్తించే సెన్సర్‌

న్యూయార్క్‌, ఫిబ్రవరి 26: గుండె సమస్యలను ముందుగానే గుర్తించి హెచ్చరించే సెన్సర్‌ తొడుగులను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇవి కృత్రిమ మేధ సహాయంతో పనిచేస్తాయి. హృద్రోగులు వీటిని తమ ఛాతిపైన ధరిస్తే అవి నిరంతరం గుండె కొట్టుకొనే తీరును పరిశీలిస్తూ విశ్లేషిస్తాయి. ఏదైన సమస్య ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు బ్లూటూత్‌ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు సమాచారాన్ని పంపిస్తాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా 100 మంది హృద్రోగులను ఎంచుకుని ఈ సెన్సర్లతో మూడు నెలల పాటు పరిశోధనలు నిర్వహించారు. 

Updated Date - 2020-02-27T08:17:55+05:30 IST