ప్రయోగాలకు వేళాయె..

ABN , First Publish Date - 2021-11-21T08:46:12+05:30 IST

సిరీ్‌సలో నామమాత్రమైన మ్యాచ్‌ కోసం ప్రతిష్ఠాత్మక ఈడెన్‌ గార్డెన్‌ ఎదురుచూస్తోంది. సిరీ్‌సను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత్‌ ఆదివారం ఇక్కడ జరిగే చివరి మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌పై నెగ్గాలనుకుంటోంది. అదే

ప్రయోగాలకు వేళాయె..

బరిలో రుతురాజ్‌, ఇషాన్‌!

కివీస్‌తో భారత్‌ చివరి టీ20 నేడు

రాత్రి 7  నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..


మూడు టీ20ల సిరీస్‌లో ఫలితం ఏంటన్నది ఇప్పటికే తేలిపోయింది. మిగిలింది ‘సిటీ ఆఫ్‌ జాయ్‌’లో భారత జట్టు క్లీన్‌స్వీప్‌ చేయడమే. అంతేకాదు.. ఇదే జోరులో రిజర్వ్‌ బెంచ్‌ను కూడా పరీక్షించాలనుకుంటోంది. వచ్చే ఏడాది జరిగే పొట్టి ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని.. కొత్త కుర్రాళ్లకు తగినంత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ ఉండాలనేది మేనేజ్‌మెంట్‌ ఆలోచన.  అటు కివీస్‌ ఈ మ్యాచ్‌తో ఓదార్పు విజయమైనా అందుకోవాలనుకుంటోంది.


కోల్‌కతా: సిరీ్‌సలో నామమాత్రమైన మ్యాచ్‌ కోసం ప్రతిష్ఠాత్మక ఈడెన్‌ గార్డెన్‌ ఎదురుచూస్తోంది. సిరీ్‌సను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత్‌ ఆదివారం ఇక్కడ జరిగే చివరి మ్యాచ్‌లోనూ న్యూజిలాండ్‌పై నెగ్గాలనుకుంటోంది. అదే జరిగితే 3-0తో సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేసినట్టవుతుంది. అయితే ఈ మ్యాచ్‌ ఫలితంతో ఇబ్బంది లేకపోవడంతో తమ రిజర్వ్‌ ఆటగాళ్లను పరీక్షించాలని కెప్టెన్‌ రోహిత్‌, కోచ్‌ ద్రవిడ్‌ భావిస్తున్నారు. మరోవైపు టీ20 ప్రపంచక్‌పలో అదరగొట్టే ఆటతీరుతో ఫైనల్‌ చేరిన న్యూజిలాండ్‌ వరుసగా మూడు ఓటములతో బేలగా మారింది. అంతేకాకుండా గత రెండు వారాల్లోనే ఆ టోర్నీ సెమీస్‌తో పాటు ఇప్పటివరకు కివీస్‌ ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి రావడం గమనార్హం. క్లిష్ట పరిస్థితిని అధిగమిస్తూ ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి భారత్‌ ఆధిక్యాన్ని తగ్గించాలనుకుంటోంది.


రిజర్వ్‌ బెంచ్‌కు అవకాశం: రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, పేసర్‌ అవేశ్‌ ఖాన్‌, స్పిన్నర్‌ చాహల్‌కు ఈ సిరీ్‌సలో ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన రుతురాజ్‌ను టాపార్డర్‌లో ఆడిస్తే రోహిత్‌.. రాహుల్‌లో ఒకరు రెస్ట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. రోహిత్‌ ఎలాగూ టెస్టు సిరీస్‌ ఆడడం లేదు కాబట్టి రాహుల్‌కు రెస్ట్‌ ఇచ్చే అవకాశముంది. ఇక, భువనేశ్వర్‌ స్థానంలో అవేశ్‌.. అశ్విన్‌ లేదా అక్షర్‌ స్థానంలో చాహల్‌ చోటు కోసం చూస్తున్నారు. అలాగే నాన్‌స్టా్‌ప క్రికెట్‌ ఆడుతున్న కీపర్‌ పంత్‌కు రెస్ట్‌ ఇచ్చి ఇషాన్‌ను ఆడించే చాన్స్‌ లేకపోలేదు. ఫామ్‌లో లేని శ్రేయా్‌సకు మరో చాన్స్‌ దక్కవచ్చు. వెంకటేశ్‌ అయ్యర్‌కు క్రీజులో తగినంత సమయం లభించడం లేదు. రెండో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగినా అప్పటికే జట్టు విజయం ఖాయమైంది. మరోవైపు బౌలర్లు మాత్రం సిరీ్‌సలో అదరగొడుతున్నారు. నాలుగేళ్ల తర్వాత టీ20ల్లో ఆడుతున్న వెటరన్‌ అశ్విన్‌ తన సత్తా నిరూపించుకోవడం భారత్‌కు లాభించే విషయం. ఈ పునరాగ మనంలో అతడు 20 ఓవర్లలో 9 వికెట్లు తీయడం విశేషం.


ఒక్క విజయం కోసం

విలియమ్సన్‌ విశ్రాంతితో ఈ సిరీ్‌సలో కివీస్‌ బ్యాటింగ్‌లో తడబడుతోంది. ఓపెనర్‌ గప్టిల్‌ పోరాడినా మిడిలార్డర్‌తో పాటు టెయిలెండర్లు రన్స్‌ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో జట్టు విలవిల్లాడుతోంది. 15 నుంచి 20 ఓవర్ల మధ్య వీరి తడబాటు భారత్‌కు లాభిస్తోంది. రెండో మ్యాచ్‌లో పవర్‌ప్లేలో 64 రన్స్‌ చేసినా అదే ఊపు చివరిదాకా కొనసాగించలేకపోయింది. బౌలింగ్‌లో కెప్టెన్‌ సౌథీ మాత్రమే సత్తా చాటుతున్నాడు. ఈ ఆఖరి మ్యాచ్‌లోనైనా సమష్టి రాణింపుతో భారత్‌కు షాక్‌ ఇవ్వాలనుకుంటోంది.


జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌, రాహుల్‌/రుతురాజ్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌, రిషభ్‌ పంత్‌/ఇషాన్‌ కిషన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌, హర్షల్‌, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌/అవేశ్‌ ఖాన్‌.


న్యూజిలాండ్‌: గప్టిల్‌, మిచెల్‌, చాప్‌మన్‌, ఫిలిప్స్‌, సైఫర్ట్‌, నీషమ్‌, శాంట్నర్‌, సౌథీ (కెప్టెన్‌), సోధీ, ఫెర్గూసన్‌, బౌల్ట్‌.


పిచ్‌: ఈడెన్‌లో కూడా మంచు ప్రభావం చూపనుంది. దీంతో టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోవచ్చు. ఒకవేళ భారత్‌ టాస్‌ గెలిస్తే ముందుగా బ్యాటింగ్‌కు దిగి తమ లైనప్‌ సత్తాను పరీక్షించాలనుకుంటోంది.



Updated Date - 2021-11-21T08:46:12+05:30 IST