Advertisement
Advertisement
Abn logo
Advertisement

గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

రామన్నపేట, డిసెంబరు 1: ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు జారిపడి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని సిరిపురం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గీత కార్మికుడు బందారపు స్వామి (55)రోజు మాదిరిగానే వృత్తిలో భాగంగా తాటిచెట్టు ఎక్కారు. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. అతడిని 108 సహాయంతో రామన్నపేట ఏరియా ఆసుప త్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన స్వామికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని గౌడ సంఘం నాయకుడు కూనూరు ముత్తయ్య కోరారు. 


Advertisement
Advertisement