Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ హార్మోన్‌తో హ్యాప్పీ..!

రోజంతా మూడ్‌ బాగుండాలి. ఎమోషన్స్‌ నియంత్రణలో ఉండాలి. జీర్ణక్రియ బాగా జరగాలి. అంటే సెరటోనిన్‌ అనే హార్మోన్‌ విడుదల సక్రమంగా జరగాలి. ఈ హార్మోన్‌ను హ్యాప్పీ హార్మోన్‌ అని కూడా అంటారు. ఈ హార్మోన్‌ అసమతుల్యత వల్ల డిప్రెషన్‌ బారినపడే అవకాశం ఉంది. మరి హ్యాప్పీ హార్మోన్‌ కోసం ఏం చేయాలంటే...


సెరటోనిన్‌ నేరుగా ఆహారం ద్వారా లభించదు. కానీ ట్రిప్టోఫాన్‌ అనే అమైనోయాసిడ్‌  మెదడులో సెరటోనిన్‌గా కన్వర్ట్‌ అవుతుంది. ట్రిఫ్టోఫాన్‌ ఎందులో లభిస్తుందంటే కోడిగుడ్లు, నట్స్‌, సీడ్స్‌, సాల్మన్‌ ఫిష్‌ వంటి హై ప్రోటీన్‌ ఫుడ్స్‌లో లభిస్తుంది. 


వ్యాయామం చేసినప్పుడు రక్తంలో ట్రిఫ్టోఫాన్‌ విడుదల అవుతుంది. అంతేకాకుండా ఇతర అమైనోయాసిడ్స్‌ విడుదలను తగ్గిస్తుంది. ట్రిప్టోఫాన్‌కు మెదడుకు చేరుకునేలా అనువైన వాతావరణం వ్యాయామం వల్ల తయారవుతుంది. 


ఎండలోకి వెళ్లినప్పుడు మెదడు సెరటోనిన్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. కాబట్టి రోజూ కొంత సమయం సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.


పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. రోజు వారి మెనూలో ప్రోబయోటిక్స్‌ ఎక్కువగా తీసుకోవాలి. ఇది పేగుల్లో ఆరోగ్యవంతమైన బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. సెరటోనిన్‌ స్థాయిలు పెరగడంలో గట్‌ హెల్త్‌ కీలకపాత్ర పోషిస్తుంది.


ధ్యానం చేయడం ద్వారా కూడా హ్యాప్పీ హార్మోన్‌ స్థాయిలు పెరుగుతాయి.

Advertisement
Advertisement