Abn logo
Sep 19 2020 @ 17:23PM

భారత్‌లో తుది దశ క్లీనికల్ ట్రయల్స్.. సోమవారం నుంచీ ప్రారంభం!

Kaakateeya

న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ రూపొందించిన కరోనా టీకాకు సంబంధించి తుది దశ(ఫేజ్-3) క్లీనికల్ ట్రయల్స్ భారత్‌లో సోమవారం నుంచీ ప్రారంభంకానున్నాయి. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పుణెకు చెందిన సస్సోన్ జనరల్ ఆస్పత్రిలో ఈ ట్రయల్స్ జరగనున్నాయి. ‘కోవీషీల్డ్(ఆక్స్‌ఫర్డ్ టీకా) వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేజ్-3 క్లీనికల్ ట్రయల్స్ సోమవారం నుంచీ ప్రారంభమవ్వచ్చు’ అని సస్సోన్ జనరల్ ఆస్పత్రి డీన్ మురళీధర్ తంబే ప్రకటించారు. 

ఈ తుది దశ టీకా పరీక్షల్లో 150 నుంచి 200 మంది వలంటీర్లు పాలుపంచుకోనున్నారు. ఇప్పటికే కొంత మంది తమ పేర్లు నమోదు చేసుకున్నట్టు మురళీధర్ తెలిపారు. ఈ ట్రయల్స్‌లో పాలుపంచుకోవాలనుకుంటున్న వారు ఆస్పత్రిని సంప్రదించాలని ఆయన సూచించారు. ఆక్సఫర్డ్ టీకాకు సంబంధించి రెండో దశ ఫేజ్-2 క్లీనికల్ ట్రయల్స్‌ను పూణెకు చెందిన భారతీ విద్యాపీఠ్ మెడికల్ కాలేజ్, కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో జరిగాయి. 


Advertisement
Advertisement
Advertisement