రేషన్‌కు సర్వర్‌ కష్టాలు

ABN , First Publish Date - 2020-07-08T11:22:08+05:30 IST

రేషన్‌ పంపిణీకి సర్వర్లు మొరాయిస్తున్నాయి. రెండు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగు తుండటంతో కార్డుదారులతోపాటు డీలర్లు తలలు

రేషన్‌కు సర్వర్‌ కష్టాలు

44 శాతం సరుకుల పంపిణీ పూర్తి 

రెండు రోజులుగా సర్వర్ల మొరాయింపు


తణుకు, జూలై 7 : రేషన్‌ పంపిణీకి సర్వర్లు మొరాయిస్తున్నాయి. రెండు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగు తుండటంతో కార్డుదారులతోపాటు డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా ప్రతీ నెలా సర్వర్ల సమస్య ఉంటోంది. వెంటనే వాటిని సరిచేసేవారు. అయితే వీటిని పరిష్కరించే ఓ ఉద్యోగికి కరోనా సోకిందనే కారణంతో  ఈ నెల ఎవరూ చేయలేదు. ఈ విషయాన్ని అధికారులు డీలర్లకు సమాచారం అందించడంతో మంగళవారం కార్డుదారులకు తెలిపారు.


ఈ విషయం సోమవారం చెప్పకపోవడంతో డీలర్లు రేషన్‌ షాపుల వద్ద కార్డుదారులతో పడిగాపులు కాశారు. సోమవారానికి 44 శాతం కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందించారు. 12 లక్షల 94 వేల 240 రేషన్‌ కార్డులకుగానూ ఐదు లక్షల 50 వేల కార్డుదారులకు సరుకులు పంపిణీ చేశారు. ఈనెల మూడో తేదీన మొదలైన సరుకుల పంపిణీ 15 వరకూ కొనసాగుతుంది. ‘సర్వర్ల సమస్యతో సరుకుల పంపిణీకి ఆటంకం ఏర్పడింది. దీనిని పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతో చర్చించాం. ఒకరోజు ఇబ్బంది వచ్చినప్పటికీ ఇంకా చాలా సమయం ఉండడం వల్ల కార్డుదారులం దరికీ సరుకులు పంపిణీ చేస్తాం. ఎటువంటి ఆందోళన అవసరం లేదు’ అని డీఎస్‌వో ఎన్‌.సుబ్బరాజు తెలిపారు. 

Updated Date - 2020-07-08T11:22:08+05:30 IST