చౌకధర దుకాణాల్లో సర్వర్‌ డౌన్‌

ABN , First Publish Date - 2020-04-04T10:36:25+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌లో ప్రజలకు పంపిణీ చేస్తుండగా చౌకధర దుకాణాల్లో సర్వర్‌డౌన్‌తో ఈపాస్‌ యంత్రాలు

చౌకధర దుకాణాల్లో సర్వర్‌ డౌన్‌

రేషన్‌ బియ్యం పొందేందుకు వినియోగదారుల అష్టకష్టాలు 

పేట జిల్లాలో 298 రేషన్‌ దుకాణాలకు 1,38,136 రేషన్‌ లబ్దిదారులు

6512 మెట్రిక్‌ టన్నుల బియ్యం కేటాయింపు


నారాయణపేట, ఏప్రిల్‌ 3 :  కరోనా లాక్‌డౌన్‌లో ప్రజలకు పంపిణీ చేస్తుండగా చౌకధర దుకాణాల్లో సర్వర్‌డౌన్‌తో ఈపాస్‌ యంత్రాలు మొరాయిస్తుండడంతో బియ్యం పొందేందుకు లబ్ధిదారులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రేషన్‌ దుకాణాల్లో బియ్యం పొందేందుకు లబ్ధిదారులు గంటల తరబడి బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా 11 మండలాలకు 298 రేషన్‌ దుకాణాలు ఉండగా 1,38,136 రేషన్‌ కార్డులకు ఒక్కొక్కరికి 12కిలోల చొప్పున రేషన్‌ బియ్య అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా వ్యాప్తంగా 6512 మెట్రిక్‌ టన్నుల బియ్యం కేటాయించి లబ్ధిదారులకు బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - 2020-04-04T10:36:25+05:30 IST