Advertisement
Advertisement
Abn logo
Advertisement

సతాయిస్తున్న సర్వర్‌

రేషన్‌ పంపిణీకి అవరోధం

కార్డుదారుల పడిగాపులు

ఒంగోలు (కలెక్టరేట్‌), డిసెంబరు 1 : జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభమైన రేషన్‌ పంపిణీకి సర్వర్‌ అడ్డంకిగా మారింది. సర్వర్‌ అప్‌ అండ్‌ డౌన్‌గా వస్తుండటంతో కార్డుదారులు రేషన్‌ కోసం మొబైల్‌ వాహనాల ద్వారా గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా బుధవారం  మొబైల్‌ వాహనాల ద్వారా ఇంటింటికీ బియ్యం, చక్కెర, కందిపప్పు పంపిణీని ప్రారంభించారు. జిల్లాలో 9,84,767 రేషన్‌ కార్డులు ఉండగా బుధవారం సాయంత్రానికి 51,839 (5.26శాతం) మందికి మాత్రమే రేషన్‌ అందింది. దీంతో కార్డుదారులు గంటల తరబడి రేషన్‌ కోసం ఆ వాహనాల వద్దనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. 


Advertisement
Advertisement