వ్యాక్సినేషన్‌కు సర్వర్‌ సమస్య

ABN , First Publish Date - 2021-03-03T05:49:10+05:30 IST

కొవిడ్‌ టీకా మందు మూడో దశ పంపిణీ మంగళవారం ఎంపిక చేసిన ప్రభు త్వాసుపత్రుల్లో (సెషన్‌ సైట్‌లు) కొనసాగగా, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసు పత్రుల్లో సాంకేతిక అవరోధాలు తలె త్తాయి.

వ్యాక్సినేషన్‌కు సర్వర్‌ సమస్య

నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు అందని లబ్ధిదారుల డేటా

ప్రభుత్వాసుపత్రుల్లో సరఫరా యథాతథం

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 2 : కొవిడ్‌ టీకా మందు మూడో దశ పంపిణీ మంగళవారం ఎంపిక చేసిన ప్రభు త్వాసుపత్రుల్లో (సెషన్‌ సైట్‌లు) కొనసాగగా, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసు పత్రుల్లో సాంకేతిక అవరోధాలు తలె త్తాయి. టీకా పంపిణీకి నిర్దేశించిన యాప్‌ దేశ వ్యాప్తంగా ఒక్కటే ఉండడంతో సర్వర్‌ సమస్య తలెత్తింది. ఎంపిక చేసిన నెట్‌వర్క్‌ ఆసు పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్‌ లబ్ధిదారుల డేటాను ఆసుపత్రుల లాగిన్‌లకు పంపకపోవడం వల్ల వ్యాక్సినేషన్‌ ఆశించినంతగా జరగలేదు. ఆ ప్రకారం నిర్దేశిత యాప్‌లో ప్రభుత్వాసుపత్రులకు తమ పేర్లు, వివరాలను ఫ్రీ రిజిస్ట్రేషన్‌ ద్వారా నమోదు చేసుకున్న వారికి మాత్రం టీకా పంపిణీ యధాతఽథంగా జరిగింది. జిల్లాలో తణుకులోని యాపిల్‌ ఆసుపత్రి మినహా మిగతా ఆరు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల లాగిన్‌లకు వ్యాక్సిన్‌ లబ్ధిదారుల డేటాను మంగళవారం సాయంత్రం వరకు పంపలేదు. దీంతో నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌ నిల్వలు సిద్ధంగా ఉన్నప్పటికీ డేటా లేకపోవడం వల్ల టీకా పంపిణీకి అడ్డంకులు ఏర్పడ్డాయి. కాగా ఎంపిక చేసిన సెషన్‌ సైట్‌లలో మంగళవారం 45–59 ఏళ్ల వయస్కులు 42 మందికి, సీనియర్‌ సిటిజన్లు 182 మందికి వ్యాక్సిన్‌ వేశారు. సోమవారం రాత్రి జిల్లాకు 26 వేల డోసుల వ్యాక్సిన్‌ నిల్వలు అందాయి.

Updated Date - 2021-03-03T05:49:10+05:30 IST