సర్వీస్‌ కష్టాలు

ABN , First Publish Date - 2020-09-23T10:14:14+05:30 IST

ఈఎస్‌ఆర్‌ నమోదుకు ప్రభుత్వం ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌ ప్రారంభించి సుమారు రెండు నెలలవుతోంది. ఆన్‌లైన్‌ పోర్టల్‌ను హడావుడిగా తయారు చేయడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.

సర్వీస్‌ కష్టాలు

 ఉద్యోగి జీవితం ప్రారంభం నుంచి ఏటా పొందే వార్షిక ఇంక్రి మెంట్లు, పీఆర్‌సీ, ప్రమోషన్లు, సెలవులు వంటి సమగ్ర సమాచారం పొందు పరచబడే అధికారిక పుస్తకమే ఎంప్లాయీస్‌ సర్వీస్‌ రిజిస్టర్‌(ఈఎస్‌ఆర్‌). ఇప్పటి వరకు ఉద్యోగి వివరాలు అన్నీ పుస్తక రూపంలో ఉండేవి. ఆ వివరాలను ఎలకా్ట్రనిక్‌ డేటా రూపంలో నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చింది.


ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సర్వీసు వివరాలను ఆన్‌లైన్‌ చేయాలని నిర్ణయించింది. కరోనాతో నమోదు పక్రియలో ఇబ్బందులతో మందకొడిగా సాగుతోంది. ఈ నెలాఖరులోగా వివరాలు నమోదు పూర్తి చేయాలంటూ విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు రావడంతో ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మరికొంత గడువు ఇవ్వాలని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు.


ఈఎస్‌ఆర్‌ నమోదుకు ప్రభుత్వం ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌ ప్రారంభించి సుమారు రెండు నెలలవుతోంది. ఆన్‌లైన్‌ పోర్టల్‌ను హడావుడిగా తయారు చేయడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ఈ పోర్టల్‌లో అనేకసార్లు సాఫ్ట్‌వేర్‌ మార్పులు జరిగాయి. ఇప్ప టికే నమోదు చేసుకొన్న ఉద్యోగులు మారిన సాఫ్ట్‌వేర్‌లో మళ్లీ మళ్లీ అప్‌డేట్‌ చేయించుకోవాల్సి వస్తోంది.


ప్రతి మండలానికి ఉపాధ్యాయులకు సంబంధించి ఎంఈవో కార్యాలయంలో ఈఎస్‌ఆర్‌ నమోదు చేయా లంటూ తొలుత ఉత్తర్వులు ఇచ్చారు. మండల వనరుల కేంద్రంలో తగినంత మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు లేక పోవడం, ఉన్న వారికి సరైన పరిజ్ఞానం లేకపోవడంతో ఉపాధ్యా యులు ఇబ్బందులు పడుతున్నారు.


మరోపక్క పాఠశాలలు ప్రారంభమైన నేపఽథ్యంలో పాఠశాలల్లో ప్రవే శాల నమోదు, రికార్డుషీట్లు జారీ వంటి పనులతో బిజీగా ఉండే ఉపాధ్యాయులు ఈ ఎస్‌ఆర్‌ నమోదు పూర్తి కాక సతమతమవుతున్నారు. జిల్లాలో ప్రాఽథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సుమారు 17 వేల మంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు 22 వేల మంది ఉన్నారు. ఇప్పటి వరకు 30 శాతం మాత్రమే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయగలిగారు.

Updated Date - 2020-09-23T10:14:14+05:30 IST