ఉమ్మడిజిల్లా ప్రజల సేవలో ముందుంటా{ ఎంపీ నామా నాగేశ్వరరావు

ABN , First Publish Date - 2021-01-17T04:35:55+05:30 IST

ఉమ్మడి ఖమ్మంజిల్లా ప్రజల రుణం తీర్చుకొనేందుకు వారికి సేవ చేసేందుకు ఎల్లవేళలా తాను ముందుంటానని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.

ఉమ్మడిజిల్లా ప్రజల సేవలో ముందుంటా{  ఎంపీ నామా నాగేశ్వరరావు
వైరాలో అంబులెన్స్‌ తాళాలు అందిస్తున్న ఎంపీ నామా

 వైరా, మధిర ప్రభుత్వ ఆసుపత్రులకు ఆంబులెన్స్‌ల వితరణ

వైరా/మధిర టౌన్‌, జనవరి 16: ఉమ్మడి ఖమ్మంజిల్లా ప్రజల రుణం తీర్చుకొనేందుకు వారికి సేవ చేసేందుకు ఎల్లవేళలా తాను ముందుంటానని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని రూ.1.38కోట్లతో జిల్లాకు నామా ముత్తయ్య ట్రస్టు ద్వారా నామా అందించిన ఆరు అంబులెన్స్‌ల్లో ఒక అంబులెన్స్‌ను శనివారం వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ చేతులమీదుగా ఎంపీ ప్రారంభింపజేశారు. అనంతరం ఎమ్మెల్యే రాములునాయక్‌ అద్యక్షతన జరిగిన సభలో నామా మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మంజిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసాయం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి కోసం ఆరు అంబులెన్స్‌లు కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఇచ్చానని తెలిపారు.  వైరాలో 30పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే రాములునాయక్‌తో కలిసి కృషిచేస్తానని నామా తెలిపారు. ఎమ్మెల్యే రాములునాయక్‌ మాట్లాడుతూ సేవాగుణం ఉన్నవారిలో నామా ముందుంటారని తన తండ్రి జ్ఞాపకార్థం ఎన్నో సేవ కార్యక్రమాలు చేసిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ సూతకాని జైపాల్‌, ముళ్లపాటి సీతరాములు, ఏఎంసీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, కౌన్సిలర్లు వనమా విశ్వేశ్వరరావు, మాదినేని సునీత, చల్లగుండ్ల నాగేశ్వరరావు, దనేకుల వేణు, లక్ష్మీబాయి, తడికమళ్ల నాగేశ్వరరావు, ఏదునూరి పద్మజ, వైరా, కొణిజర్ల మండలాల టీఆర్‌ఎస్‌ అద్యక్షులు పసుపులేటి మోహన్‌రావు, కోసూరి శ్రీనివాసరావు, డాక్టర్‌ కాపా మురళీకృష్ణ, కట్టా కృష్ణార్జున్‌రావు, మచ్చా బుజ్జి పాల్గొన్నారు.

ఫమధిరటౌన్‌: మధిర ప్రభుత్వ ఆసుపత్రికి  ఎంపీ నామ నాగేశ్వరరావు శనివారం అంబులెన్స్‌ వితరణ చేశారు. ఆసుపత్రిలో జరిగినకార్యక్రమంలో మెడికల్‌ ఆపీసర్‌ డా.అనిల్‌కుమార్‌ కు అంబులెన్స్‌ తాళం చేతులు అందించారు. మంత్రి కేటిఅర్‌ పుట్టిన రోజు సంధర్బంగా గిప్ట్‌ ఎస్మెల్‌ కార్యక్రమంలో బాగంగా ఖమ్మం లోకసభ పరిధిలో గల 6 నియోజకవర్గ కేంద్రాలలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అంబులెన్స్‌ లు ఉచితంగా ఇవ్వనున్నట్లు హమీ ఇచ్చారు. దానిలో భాగంగా అదునాతన ఆంబులెన్స్‌ ను మధిర ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ కమలరాజ్‌, డీసీసీబీ డైరెక్టర్‌ తుళ్లూరి బ్రహ్మయ్య, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్‌పర్సన్‌ మొండితోక లత, శీలం విద్యాలత, ఆత్మ కమిటి చైర్మన్‌ రంగిశెట్టి కోటేశ్వరరావు నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-17T04:35:55+05:30 IST