Advertisement
Advertisement
Abn logo
Advertisement

నువ్వుల చట్నీ

కావలసినవి: నువ్వులు - 200 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు - ఆరు, నిమ్మరసం - కొద్దిగా, పంచదార - ఒక టీస్పూన్‌, కొత్తిమీర - ఒక కట్ట, పచ్చిమిర్చి - నాలుగు, ఉప్పు - తగినంత. 


తయారీ విధానం: ముందుగా నువ్వులను వేగించాలి. తరువాత మిక్సీలో వేసి పొడి చేయాలి. తరువాత అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి పట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం వేయాలి. కొద్దిగా ఉప్పు, పంచదార వేసి మరోసారి గ్రైండ్‌ చేసుకోవాలి. సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకుని అన్నం లేదా చపాతీతో వడ్డించాలి.


పోషక విలువలు

నువ్వుల్లో కాల్షియం, ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడే వారికి నువ్వులు మంచి ఆహారం.

ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తుంది. శాకాహారులు ప్రొటీన్‌ కోసం నువ్వులు తీసుకోవచ్చు. 

క్రమంతప్పకుండా నువ్వులు తింటే హైపర్‌టెన్షన్‌, డయాబెటిస్‌ నియంత్రణలో ఉంటాయి. 

నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. 

వీటిలో మోనోశాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ ఉన్నాయి. గుండెకు మేలు చేసే ఒలెయిక్‌ యాసిడ్‌ నువ్వుల్లో లభిస్తుంది.

ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన జింక్‌, మెగ్నీషియం, కాల్షియం వీటిలో లభిస్తాయి.

నువ్వుల్లో ఔషధగుణాలు పుష్కలం అని ఆయుర్వేదం చెబుతోంది. చర్మ సంరక్షణ కోసం నువ్వుల నూనె పనికొస్తుంది.

రోజూ ఆహారంలో నువ్వుల నూనె తీసుకోవచ్చు. 

క్యారెట్‌ పచ్చడిపుదీనా పెరుగు చట్నీకొత్తిమీర చట్నీఖట్టా మీఠా చట్నీనీటి ఆవకాయ పచ్చడిమామిడి తరుము పచ్చడిఅరటికాయ పెరుగు పచ్చడిముల్లంగి తొక్కుక్యాప్సికమ్‌ పెరుగు పచ్చడితీపి కాకర పచ్చడి
Advertisement