లడ్డూలు

నువ్వులు...పోషకాల దివ్వెలు

పోషకాలతో నిండిన నువ్వులు రోగనిరోధకశక్తిని పెంచుతాయి.  వీటితో చేసిన వంటలు తింటే  ఆరోగ్యం ఎంచక్కా ఉంటుంది. నువ్వులతో బర్ఫీ, చట్నీ, పులావు, పిల్లలు ఇష్టంగా తినే లడ్డూలు చేసుకోవచ్చు. మరి మీరూ నువ్వుల రుచులను ఆస్వాదించండి.


కావలసినవి: నువ్వులు - 100గ్రాములు, బెల్లం - 100గ్రాములు, యాలకుల పొడి - అర టీస్పూన్‌.


తయారీ విధానం: ముందుగా స్టవ్‌పె పాన్‌ పెట్టి నువ్వులను వేగించాలి. నువ్వులు మరీ ఎక్కువగా వేగకుండా చూసుకోవాలి. చిటపటమంటున్న సమయంలోనే దింపి ప్లేట్‌లోకి మార్చుకోవాలి. అదే పాన్‌లో కొద్దిగా నీళ్లు పోసి బెల్లం వేసి పానకం తయారుచేసుకోవాలి. తరువాత అందులో యాలకుల పొడి, నువ్వులు వేసి కలపాలి. మిశ్రమం చల్లారిన తరువాత కొద్దికొద్దిగా తీసుకుంటూ లడ్డూలు తయారుచేసుకోవాలి. గాలి తగలని జాడీలో పెట్టుకుంటే ఇవి నిల్వ ఉంటాయి. ఐరన్‌ సమృద్ధిగా లభించే ఈ లడ్డూలను పిల్లలు ఇష్టంగా తింటారు.

క్వినోవా ఖీర్‌నువ్వుల బర్ఫీషీర్‌ కుర్మా డ్రైఫ్రూట్స్‌ కజ్జికాయలురస్‌ మలాయిఖర్బూజ బర్ఫీఖీర్‌డ్రైఫ్రూట్స్‌ లడ్డూగాజర్‌ హల్వాకాజూ బర్ఫీ
Advertisement
Advertisement