శేషేంద్ర 94వ జయంతి సాహిత్య సదస్సు ‘యువ న్యాయవాదుల విజయానికి మార్గదర్శకాలు’ దీపావళి కవితల పోటీ

ABN , First Publish Date - 2020-10-19T06:09:16+05:30 IST

తెలుగు సాహితీవనం-హాస్యపు హరివిల్లు మాసపత్రిక ఆధ్వర్యంలో శ్రీ చీపురు అప్పారావు స్మారక జాతీయస్థాయి దీపావళి కవితల పోటీకి ఆహ్వానం...

శేషేంద్ర 94వ జయంతి సాహిత్య సదస్సు  ‘యువ న్యాయవాదుల విజయానికి మార్గదర్శకాలు’  దీపావళి కవితల పోటీ

శేషేంద్ర 94వ జయంతి సాహిత్య సదస్సు

మహాకవి శేషేంద్ర 94వ జయంతి సాహిత్య సదస్సు కమలాకర కళాభారతి, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త నిర్వహణలో అక్టోబర్‌ 20 సా.6 గంటలకు త్యాగరాయ గానసభలో జరుగుతుంది. ఎస్‌.వి. సత్యనారాయణ, లక్ష్మణ చక్రవర్తి, టి. గౌరీశంకర్‌, బైస దేవదాస్‌, సాత్యకి పాల్గొంటారు. వివరాలకు: 94410 70985.

గుంటూరు శేషేంద్రశర్మ మెమోరియల్‌ ట్రస్ట్‌


‘యువ న్యాయవాదుల విజయానికి మార్గదర్శకాలు’ 

జస్టిస్‌ బి. చంద్రకుమార్‌ రాసిన ‘యువ న్యాయవాదుల విజయా నికి మార్గదర్శకాలు’ పుస్తక ఆవిష్కరణ సభ అక్టోబర్‌ 21 ఉ.11 గంటలకు ప్రెస్‌క్లబ్‌, సోమాజిగూడ, హైదరాబాద్‌లో జరుగుతుంది. జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి, జస్టిస్‌ పి. వెంకటరామరెడ్డి, జస్టిస్‌ జి. చంద్రయ్య, జస్టిస్‌ ఎం.వెకటేశ్వరరెడ్డి, మాడభూషి శ్రీధర్‌, జస్టిస్‌ వామన్‌ రావు, జస్టిస్‌ యతిరాజులు తదితరులు పాల్గొంటారు. 

బెజ్జారం ప్రతిభ


దీపావళి కవితల పోటీ 

తెలుగు సాహితీవనం-హాస్యపు హరివిల్లు మాసపత్రిక ఆధ్వర్యంలో శ్రీ చీపురు అప్పారావు స్మారక జాతీయస్థాయి దీపావళి కవితల పోటీకి ఆహ్వానం. వచన కవితలు 25 పంక్తులు మించకుండా, ఒకరు ఒక కవిత మాత్రమే పంపించాలి. ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు వరుసగా: రూ.2500, రూ.2000, రూ.1000, వీటితోపాటు 10 కన్సొలేషన్‌ బహుమతులు రూ.500 చొప్పున అందజేస్తారు. కవితలను నవంబర్‌ 15లోగా ఈ మెయిల్‌: tskavithalu@gmail.comకు పంపాలి. వివరాలకు:9502236670.

శాంతి కృష్ణ 

Updated Date - 2020-10-19T06:09:16+05:30 IST