Aug 4 2021 @ 11:05AM

ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో సేతుపతి.. ఆకట్టుకుంటున్న 'సూపర్ డీలక్స్' ట్రైలర్

తమిళంలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న మూవీ 'సూపర్ డీలక్స్'. ఈ సినిమాని తెలుగులో ఆగస్టు 6న తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ఈ క్రమంలో తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. త్యాగరాజన్‌ కుమార రాజా తెరకెక్కించగా, క్రేజీ యాక్టర్స్ విజయ్‌సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సమంత, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. విజయ్ సేతుపతి ఇందులో ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నటించి మరోసారి తన మార్క్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక సమంత కూడా కాస్త బోల్డ్ పాత్రలో రెచ్చిపోయి నటించింది. ఫహద్‌ ఫాజిల్‌, రమ్యకృష్ణ పాత్రలు బాగా ఆకట్టుకుంటున్నాయి. కాగా నలుగురు వ్యక్తుల జీవితాల్లో ఒకేసారి జరిగే వేర్వేరు సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులో ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.