నగరంలో కంటైన్మెంట్‌ జోన్‌ల ఏర్పాటు

ABN , First Publish Date - 2020-04-09T10:46:13+05:30 IST

జిల్లా కేంద్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైన నేప థ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో

నగరంలో కంటైన్మెంట్‌ జోన్‌ల ఏర్పాటు

సాయినగర్‌ 7వ క్రాస్‌, మారుతీనగర్‌లోని 80 అడుగుల రోడ్డు,  రామ్‌నగర్‌,  జీసెస్‌నగర్‌లలో ఏర్పాటు

ఆ ప్రాంతాల ప్రజలు బయట తిరగకుండా బారికేడ్ల ఏర్పాటు  

అధికారులకు కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశం 


అనంతపురం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైన నేప థ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ జోన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. బుధవారం  సాయంత్రం ఆయన నగరం లోని సాయినగర్‌ 7వ క్రాస్‌, మారుతీనగర్‌ 80 ఫీట్‌ రోడ్డు, రామ్‌నగర్‌లోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నగరంలోని సాయి నగర్‌ 7వ క్రాస్‌, మారుతీనగర్‌లోని 80 ఫీట్‌ రోడ్డు, రామ్‌ నగర్‌, జీసెస్‌నగర్‌లలో కంటైన్మెంట్‌ జోన్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.


ఆయా కంటైన్మెంట్‌ జోన్‌లలో బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు బయట తిరగకుండా చర్యలు తీసు కోవాలని డీఎస్పీ వీరరాఘవరెడ్డిని ఆదేశించారు. కంటైన్మెం ట్‌ జోన్‌లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడంతో పాటు సోడియం హైక్లోరైడ్‌ రసాయనాన్ని అ న్నిచోట్ల స్ర్పే చేయించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ రవీంద్రను ఆదేశించారు. ఆ ప్రాంతాల్లో ఎంత మంది ప్రజలు నివసిస్తున్నారో వివరాలు సిద్ధం చేయాలన్నారు. వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు, కూరగాయల సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ విషయాన్ని ఆయా ప్రాంతాల ప్రజలకు తెలియజేయాల న్నారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా మైకుల ద్వారా అనౌన్స్‌ చేయాలన్నారు.


నిరంతరం ఆయా కంటైన్మెంట్‌ జోన్‌ల ప్రాంతాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చే యాలని డీఎస్పీని ఆదేశించారు. ప్రజలెవ్వరూ భయపడ కుండా ధైర్యంగా ఇళ్లలోనే ఉండేలా అవగాహన కల్పిం చాలన్నారు. రామ్‌నగర్‌ ప్రాంతాన్ని కంటైన్మోంట్‌ జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో ఫ్లై ఓవర్‌ కింద ఉన్న మార్కెట్‌ను రామ్‌నగర్‌లోనే ఉన్న శివాజీ పార్కులో ఏర్పాటు చేసేందు కు చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం నుంచి శివాజీ పార్కులోనే కూరగాయల విక్రయాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ విషయాన్ని మైకుల ద్వారా ప్రజలకు చేరవేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ-2 రామ్మూర్తి, ము న్సిపల్‌ అధికారులు, శానిటేషన్‌ అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2020-04-09T10:46:13+05:30 IST