స్మార్ట్ హోమ్‌కు ఏడు గాడ్జెట్లు

ABN , First Publish Date - 2021-01-02T06:11:11+05:30 IST

చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు, జీవితాన్ని సుఖవంతం చేసుకునే రోజులు వచ్చాయి. కొవిడ్‌ ఈ సరికొత్త ధోరణికి మరింత ఊపు తెచ్చింది. డివైజ్‌ల ఇంటర్‌కనెక్టివిటీతో జీవితం మరింత సాఫీగా సాగుతోంది

స్మార్ట్ హోమ్‌కు ఏడు గాడ్జెట్లు

చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు, జీవితాన్ని సుఖవంతం చేసుకునే రోజులు వచ్చాయి. కొవిడ్‌ ఈ సరికొత్త ధోరణికి మరింత ఊపు తెచ్చింది. డివైజ్‌ల ఇంటర్‌కనెక్టివిటీతో జీవితం మరింత సాఫీగా సాగుతోంది. ఇళ్లు స్మార్ట్‌ హోమ్స్‌గా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు. షావోమీ, రియల్‌మి బ్రాండ్లు గత ఏడాది తమ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఒటి) పోర్ట్‌ఫోలియోను బాగా విస్తృతపర్చాయి. స్మార్ట్‌ స్పీకర్లు, స్మార్ట్‌ ప్లగ్‌లు, ఆటోమేటిక్‌ సోప్‌ డిస్పెన్సర్‌ సహా పలు ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చాయి. ఫలితంగా హోమ్‌ ‘స్మార్ట్‌’ గా మారింది. ఏడు వేల రూపాయల కంటే తక్కువ మొత్తానికే అందుబాటులోకి వచ్చిన కొన్ని గాడ్జెట్లను చూద్దాం.


ఎంఐ ఆటోమేటిక్‌ సోప్‌ డిస్పెన్సర్‌ (రూ.999)

ఒకటి తక్కువ వెయ్యి రూపాయలకు లభించే దీన్లో ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సర్లకు తోడు కాంటాక్ట్‌ ఫ్రీ హైజీన్‌ అని చెప్పవచ్చు. పటిష్టతకు తోడు ఎక్కువ కాలం దీన్ని హాయిగా వినియోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. 


రియల్‌మి స్మార్ట్‌ ప్లగ్‌ (రూ.799)

ఈ ప్లగ్‌ వైఫై కంట్రోల్‌గా గూగుల్‌ అసిస్టెంట్‌, అమెజాన్‌ అలెక్సాతో పనిచేస్తుంది. అయిదంచెల సేఫ్టీ ప్రొటక్షన్‌ కూడా ఉన్న ఈ స్మార్ట్‌ ప్లగ్‌ రేటు రూ.799 మాత్రమే. 


రియల్‌మి సౌండ్‌బార్‌ (రూ6,999)

60 వాట్‌ ఫుల్‌ రేంజ్‌ స్పీకర్లు, 40 వాట్‌ సబ్‌ఊఫర్‌ ఈ సౌండ్‌బార్‌కు ఉన్నాయి. వైర్‌లెస్‌ కనెక్టివిటీ కోసం 5.0 బ్లూటూత్‌ వెర్షన్‌ను ఆ ఆడి డివైస్‌ ఆఫ్‌ర్‌ చేస్తోంది. 


రియల్‌మి ఎన్‌1 ఎలక్ట్రిక్‌ టూత్‌బ్ర్‌ష (రూ.1,499)

ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే చాలు, 130 రోజులు ఉపయోగించుకునే సౌలభ్యం ఉన్న ఈ టూత్‌బ్ర్‌ష చార్జ్‌ రూ.1,499 మాత్రమే. 99.99 శాతం మేరకు  బ్యాక్టీరియాను నిరోధించే విధంగా డ్యుపాంట్‌ వెంట్రుకలు కలిగి ఉంటుంది.  అయిదు నిమిషాలు ఛార్జ్‌ చేస్తే, తొమ్మిది రోజులు నిరాటంకంగా ఉపయోగించుకోవచ్చు. మూడు సార్లు ఫుల్‌ఛార్జ్‌ చేస్తే ఇక ఏడాది మొత్తం వినియోగించుకోవచ్చు.


రియల్‌మి స్మార్ట్‌ కెమెరా 360 (రూ.2,599)

రీలమ్‌ స్మార్ట్‌ కెమెరా 360 కేవలం రూ.2,599కే అందుబాటులోకి వచ్చింది. 180 పిక్సెల్‌, ఎఫ్‌హెచ్‌డి రికార్డింగ్‌ సామర్థ్యాలను కలిగి ఉన్న కెమెరా ఇది. 360 డిగ్రీల ఓమ్మీ-డైరెక్షనల్‌ రొటేషన్‌ సదుపాయం ఉంది. ఇన్‌ఫ్రారెడ్‌ నైట్‌విజన్‌, మల్టిపుల్‌ ప్రైవసీ రక్షణ, వాయిస్‌ టాక్‌బ్యాక్‌ కూడా ఉన్నాయి. 


షావోమీ స్మార్ట్‌ ఎల్‌ఇడి వైట్‌ బల్బ్‌ (రూ.799)

7.5 డబ్లుబి 22 స్మార్ట్‌ ఎల్‌ఇడి బల్బ్‌ ఇది. అమెజాన్‌ అలెక్సా, గూగుల్‌ అసిస్టెంట్‌కు అనువైనది. పలు రంగుల్లో ఈ బల్బు లభ్యమవుతుంది. 


ఎంఐ స్మార్ట్‌ స్పీకర్‌ (రూ.3,999)

ఫ్రిడ్జ్‌, గీజర్‌ వంటి గృహోపకరణాలను ఈ స్మార్ట్‌ స్పీకర్‌తో  కంట్రోల్‌ చేసుకోవచ్చు. 63.5ఎంఎం డ్రైవర్‌ స్పీకర్‌తో దీనికి వైఫై, బ్లూటూత్‌ కనెక్టివిటీ ఆఫ్షన్లు ఉన్నాయి.

Updated Date - 2021-01-02T06:11:11+05:30 IST